ప్రేమికుల గురించి సింగర్ మనోవేదన

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pranai and amrutha
Updated:  2018-09-18 11:05:03

ప్రేమికుల గురించి సింగర్ మనోవేదన

తెలుగు రాష్ట్రాలను రెండు రోజులనుండి ఒక  సామజిక అకృత్యం వెంటాడుతుంది.  ప్రేమించి పెళ్లాడిన పాపానికి ఒక యువకుడిని యువతీ తాలూకా తండ్రి, బాబాయిలు నిర్ధాక్షిణ్యంగా అత్యంత పాశవికంగా హత్యా చేశారు. ఈ విషయం మీద ప్రముఖులు తమ అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు.
 
తాజగా డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు గాయని అయినటువంటి శ్రీపాద చిన్మయి ఒక భారీ పోస్ట్ ని తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసింది. ఈ హ‌త్యోదంతం ఆమెను ఎంత‌లా క‌దిలించిందో.. ఆమె పోస్ట్‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతమే ఒకటి తమిళనాడులో కూడా చోటుచేసుకుంది. దానితో పోలుస్తూ ఈ హత్యమీద తన భావాల్ని పంచుకుంది. 
 
ఆ పోస్ట్ యొక్క ముఖ్యంశాలు :
 
- భారత్‌లో కులం పేరు చెప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు, సినీ నటుడు.. ఎవరైనా సరే మనలేరు.  అది వ్యవస్థలో అంతర్భాగమైంది.  కులాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద పెద్ద కేసుల నుంచి చాలా మంది బయటపడుతున్నారు.
 
- కులం పేరుతో అణచివేయడమనేది ఈ దేశంలో భయంకరమైన నిజం. పెద్ద కులస్థుల బావిలో నీళ్లు తాగారని బడుగుల పిల్లలను చావగొట్టిన సంఘటనలున్నాయి. ఇలాంటి వాళ్లను మార్చలేమని.. కొంతమంది అంటుంటారు. 
 
- ఈ రోజుల్లో పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి, అబ్బాయిలది చెరో సగం అనేవాళ్లు ఎంతమంది ఉన్నారు..? పెళ్లి అంటే అమ్మాయిది మాత్రమే అనేలా.. కోట్లలో ఖర్చు చేయించేవారు చాలామంది ఉన్నారు.  కులాన్ని అంత త్వరగా ఈ దేశం నుంచి తీసెయ్యలేం.
 
- ఇలాంటి మ‌నుషులు మార‌రు అనే కంటే.. ముందు మీరు.. మీ కులాభిమానాన్ని.. ఆలోచ‌న‌ల్ని.. కుల అహంకార‌న్ని గుర్తించి.. వాటిని క‌రెక్ట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ త‌ర్వాతే మిగితా వాళ్ల గురించి మాట్లాడండి. ముందు మీరంతా వ్యక్తిగత బాధ్యత తీస్కోండి. ఆ తర్వాత సామాజిక బాధ్యత గురించి మాట్లాడంటూ చురకలు వేసింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.