మరోసారి వార్తల్లోకి శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-10-05 02:19:03

మరోసారి వార్తల్లోకి శ్రీ రెడ్డి

శ్రీరెడ్డి... ఈ పేరు ని తెలుగు ప్రేక్షకులు ఎవరు మర్చిపోయి ఉండరు.. మీడియా లో ఈమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. ఏకంగా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై, హీరో నాని, దర్శకుడు కొరటాల శివ పై ఈవిడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తో శ్రీ రెడ్డి రేపిన దూమరం ఇంకా ఎవరు మర్చిపోరు.తమిళ్ సినిమా పై కన్నేసి రాఘవ లారెన్స్ ని సైతం శ్రీ రెడ్డి వేడి తాకకపోలేదు. అయితే శ్రీ రెడ్డి మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈసారి అయితే సీనియర్ నటుడు పై పడింది.
 
ఈ నటుడు రాసలీలలు పై నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు హీరోగా ఓ వెలుగు వెలిగి,కామెడీతో తనదైన ముద్ర వేసి, కామెడీ కి సరికొత్త ఇమేజ్ ని హీరోయిజాన్ని తెచ్చిపెట్టి ఎన్నో అద్భుత విజయాలను అందుకున్న  నట కిరీటి రాజేంద్రప్రసాద్.
 
రాజేంద్రప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే నీ బాగోతం బయటపెడతా అంటూ సవాల్ విసిరింది.అంటే ఈ సీనియర్ నటుడి లీలల గురించి శ్రీ రెడ్డి దగ్గర సమాచారం ఏమైనా ఉందా? లేక ఊరికే సవాల్ విసురుతోందా..? రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి..? ఈసారైనా బయట పెడుతుందా లేక గతంలో లాగే ట్వీట్ లతోనే సరిపెడుతుందా అనేది చూడాలి.. శ్రీ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారు ? అసలు స్పందింస్తారో, లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.