అంతా తూచ్ మా లో గొడవలేం లేవు.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 06:07:17

అంతా తూచ్ మా లో గొడవలేం లేవు.

గతకొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేన్ (మా) లో జరుగుతున్న గందరగోళం తెలిసిందే.  అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ లు నువ్వంటే నువ్వు అనే స్థాయికి దిగజారి సినీ పరిశ్రమ పరువు మంటగలిపారు. నిధుల దుర్వినియోగం అయ్యాయంటూ మొదలైన ఈ వ్యవహారం ఇప్పటికి సర్దుమణిగింది. 
 
ఎట్టకేలకు సినీపెద్దల చొరవతో ఈ ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పెద్దలంతా తలో మొట్టికాయ వెయ్యడం తో శివాజీ రాజా, నరేష్ లు మెట్టుదిగి రాజీకొచ్చారు. దాంతో గొడవ కంచికి చేరుకుంది. నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేసిన భగ్గుమన్న పరిస్థితులు ఇప్పుడు చల్లరాయి. మొదట్లో వారిద్దరూ మా బిల్డింగ్ కోసం వసులు చేసిన నిధులను దుర్వినియోగం చేసారంటూ నిందలు మోపుకున్నారు. 
 
కాగా ఈ వివాదం వల్ల సినీ ఇండస్ట్రీ పరువుపోతోందని భావించిన పెద్దలు సమావేశమై ఎలాంటి తప్పులు జరగలేదని , ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మీడియాకు ఎక్కొద్దని మరింత పెద్దదిగా చేయొద్దని సలహా ఇవ్వడం తో ఈరోజు మీడియా ముందుకు వచ్చి అంతా తూచ్  మేమంతా ఒక్కటయ్యాం , విబేధాలు పక్కన పెట్టాం అని సెలవిచ్చారు సదరు వ్యక్తులు. ఈ సమావేశంలో అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు , కే ఎల్ నారాయణ , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ , శివాజీరాజా , నరేష్  తదితరులు పాల్గొన్నారు .

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.