అరవింద సమేత సినిమా లో ఇది మిస్ అయ్యింది..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-10-08 05:34:20

అరవింద సమేత సినిమా లో ఇది మిస్ అయ్యింది..

జూ.ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చేది కనువిందైన మాస్ డాన్సులు, ఆ తరువాత ఫైట్లు.. తారక్ స్టెప్స్ వేస్తే థియేటర్ లో ఈలల గోలతో మోత మోగాల్సిందే.. అయితే మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న అరవింద సమేత చిత్రం కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపద్యంలో ఒక వార్త హల్చల్ చేస్తోంది..అరవింద సమేత చిత్రం కేవలం నాలుగు పాటలతో మాత్రమే రిలీజ్ అవ్వనుంది అని.. దీనికి చిత్ర యూనిట్ నుండి నిజమనే సమాధానమే వినిపిస్తుంది. అయితే మొదట 5 పాటలు అనుకున్నారని, షూట్ చేసే సమయం లేక ఒక పాట చెయ్యలేదని చెప్తున్నారు.. ఆల్బమ్ కూడా 4పాటలతోనే రిలీజ్ చేశారు.అరవింద సమేత షూటింగ్ మొదలవ్వడమే కాస్త ఆలస్యంగా మొదలైంది.

దీంతో షెడ్యూల్స్ అన్నీ లేటవుతూ వచ్చాయి. మధ్యలో తారక్ నాన్నగారు ఆక్సిడెంట్ లో పోయిన సంగతి తెలిసిందే, ఈ సంఘటనల ప్రభావం కూడా షూటింగుపై పడింది..ఐదో పాట కేవలం ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరచడానికి ప్లాన్ చేసిందే. ఆ పాట సినిమాలో లేక పోయినా సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండబోదు అని త్రివిక్రమ్ ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.