అందాల న‌టి శ్రీదేవి ఇంట‌ పెళ్లి క‌ళ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sonam kapoor marriage
Updated:  2018-03-24 04:26:36

అందాల న‌టి శ్రీదేవి ఇంట‌ పెళ్లి క‌ళ‌

ప్రముఖ నటి శ్రీదేవి అకాల‌ మరణం యావత్ సినీ ప్ర‌పంచాన్ని, అభిమానుల‌ను ఎంతటి షాక్ కు గురి చేసిందో తెలిసిందే.  శ్రీదేవి మ‌ర‌ణ వార్త‌ను మ‌రిచి పోవ‌డానికి దేశ ప్రజలకే సాధ్యం కానప్పుడు... ఇక కపూర్ ఫ్యామిలీ ఎలా మ‌రిచిపోతుంది. పెద్ద కోడలి ఆకస్మిక మరణంతో  తీవ్ర విషాదంలో  ఉంది కపూర్ కుటుంబం. అయితే ఈ విషాదాన్ని దూరం చేయ‌డానికి త్వరలో ఒక శుభకార్యం జరగనుందన్న విషయం జోరుగా ప్ర‌చారం సాగుతోంది.
 
అందాల న‌టీ శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె, టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ త్వరలోనే పెళ్లిపీటల  ఎక్కనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఒక మ్యాగ్ జైన్ ప్రముఖంగా ప్రచురించింది.
శ్రీదేవి విషాదాన్ని అధిగమించేందుకు ఈ శుభకార్యం ఉప‌స‌మ‌నం క‌లిగిస్తుంద‌ని భావిస్తున్నారు. 
 
32 ఏళ్ల సోనమ్ కపూర్ గ‌త కొంత కాలంగా వ్యాపారవేత్త అయిన‌ ఆనంద్ ఆహుజాతో  చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన‌ విష‌యం అంద‌రికి తెలిసిందే. శ్రీదేవి అంత్య‌క్రియ‌ల‌కు బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో క‌లిసి సోనమ్ కపూర్ హ‌జ‌రైంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.  అన్ని అనుకున్నట్లు జరిగితే మే 11 లేదంటే మే 12 తేదీల్లో సోనమ్ పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు. ఈ పెళ్లికి వ‌చ్చే అతిధుల‌కు ఫ్లైట్ టికెట్స్ ను ఇప్పటికే బుక్ చేసినట్లుగా తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.