ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:26:09

ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్

"బాహుబలి" తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా "సాహో". యంగ్ డైరెక్టర్ అయిన సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కోసం ఒక స్పెషల్ సాంగ్ డిజైన్ చేసాడు అట సుజీత్.
 
అసలైతే స్క్రిప్ట్ ప్రకారం స్పెషల్ సాంగ్ లేదు అంట. కానీ సడెన్ గా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిన దర్శకుడు సుజిత్ ఆ పాటకోసం స్పెషల్ సిట్యువేషన్ క్రియేట్ చేసి మరి ప్లాన్ చేశాడట. స్పెషల్ సాంగ్ కోసం ఇంత హంగామా చేస్తుండడంతో అందరి దృష్టి దీనిపై పడింది.
 
ఈ సినిమాలో చాలా వరకు బాలీవుడ్ నటుల్ని ఫిక్స్ చేశాడు ఫిలిం మేకర్స్. ఇప్పటికే శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముఖేష్, చుంకి పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడి వంటి హేమాహేమీలు ఈ మూవీ లో నటిస్తున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్ కోసం సుజీత్ ఏ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటాడో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.