"అదుగో"లో ప్రత్యేక సాంగ్ మతలబు ఏమై ఉంటుంది.?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ravi babu
Updated:  2018-09-18 01:31:17

"అదుగో"లో ప్రత్యేక సాంగ్ మతలబు ఏమై ఉంటుంది.?

విలక్షణమైన కథలను తెరకెక్కించడం లో తనకు తానే సాటి దర్శకుడు రవిబాబు. ఆయన తీసిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఏదో ఒక పర్టీకులర్ జోనర్ కి పరిమితం కాకుండా అన్ని రకాల జోనర్లను టచ్ చేస్తూ ఉంటాడు ఈ వినూత్న దర్శకుడు. ఇప్పుడు ఒక పంది తో సినిమా తియ్యడానికి పూనుకుని..విజయవంతంగా తెరకెక్కించాడు రవిబాబు.
 
ఈ సినిమా తాలూకు టీజర్ ఇప్పటికే విడుదల అయ్యింది. అనుకుంత స్థాయిలో లేకపోయినప్పటికీ ఏదో ఉండబోతుందనే ఉత్కంఠను పుట్టించింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమాలో నటి పూర్ణ ప్రత్యేక గీతంలో నటిస్తున్నది. ఈ పాట ఈరోజు విడుదలయింది. ఈ పాటలో పూర్ణతో పాటు సినిమాలో బంటిగా నటిస్తున్న పందిపిల్ల కూడా సందడి చేసింది.
 
ఈ పాట విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రాన్నికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. దసరా సెలవుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. దర్శకనిర్మాతలు ఈ సినిమాని ఇతర భాషల్లోకి కూడా అనువదించి భారీ స్థాయిలో  విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇలాంటి చిత్రాలు తెలుగులో కొత్తేమికాదు. సంచాల విజయాల దర్శకుడు రాజమౌళి “ఈగ” తో చిత్రాన్ని తీసి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఘనతను చాటి చెప్పాడు. ఇప్పడు ఈ “అదిగో” ఆ స్థాయికి చేరుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.