సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-03-24 17:51:18

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి

కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి..... ఈమె గురించి మా జ‌న‌హితం టీవీ అందిస్తుంది స్పెష‌ల్ స్టోరీ....
 
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన  శ్రీ రెడ్డి గురించి ..  బ‌హుశా ఈ పేరు గ‌తంలో చాలా మందికి తెలియ‌క‌పోవచ్చు.. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ ఆమె ఇంట‌ర్వ్యూ ద్వారా అంద‌రికి తెలిసిపోయింది... ఈ ఇంట‌ర్వ్యూలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరోయిన్స్ పై జ‌రుగుతున్న  లైంగిక వేధింపుల గురించి క్షుణ్ణంగా మీడియా ద్వారా వివ‌రించారు శ్రీ రెడ్డి..
 
అయితే తాను ఇందంతా సినిమా అవ‌కాశాల కోసం చేయ‌లేద‌ని, ప్ర‌స్తుతం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను చెప్పెందుకు వచ్చాన‌న్నారు... తాను కూడా ఓ మ‌హిళ‌నేన‌ని, సినిమా ముసుగులో అవ‌కాశం కోసం వ‌చ్చిన హీరోయిన్స్ ను వారి అవ‌కాశాన్ని ఆస‌రాగా చేసుకుని ప్ర‌తీ ఒక్క‌రు త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వినియోగించుకుంటార‌ని అన్నారు..
 
అంతేకాదు ఆ స‌మ‌యంలో క‌డుపు నొప్పి వ‌స్తోంది కాసేపు రెస్ట్ ఇవ్వండి సార్ అని వేడుకున్నా కూడా వ‌దల‌ర‌ని శ్రీ తెలిపారు.. అమ్మా..అని అన‌డం వేరు... అమ్మా..అమ్మా.. అన‌డం వేరు అని అన్నారు.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ అంద‌రూ చిత్ర యూనిట్ బృందం ద‌గ్గ‌ర  ప‌డుకున్న‌పుడు అమ్మా.. అమ్మా  వ‌ద‌లండి అన్నా కూడా వారి సేద తీర్చుకునే వ‌ర‌కూ వ‌దిలి పెట్ట‌ర‌ని తెలిపారు.
 
అయితే ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌తీ ఒక్క‌రు త‌మ‌కెందుకులే అని భావించ‌కుండా ఆలోచించాలి మ‌న కళ్ల ముందు మ‌హిళ‌ల‌పై ఇంత‌ దారుణం జ‌రుగుతున్నా వాటిని జ‌నాలంద‌రూ ఖండించాలి... అన్ని దేశాల కంటే మ‌న దేశ ప్ర‌జా స్వామ్యం  గొప్ప‌ద‌ని, ఈ దేశంలో ఉన్న ఫ్రీడం మ‌రెక్క‌డా లేద‌ని విదేశీయులు మ‌న దేశాన్ని గౌర‌విస్తారు.. ఇలాంటి మ‌న ప్ర‌జా స్వామ్యంలో మ‌హిళల‌పై జ‌రుగుతున్న అన్యాయంపై శ్రీ రెడ్డి చేస్తున్న పోరాటానికి ప్ర‌తీ ఒక్క‌రు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని మా జ‌న‌హితం టీవీ కోరుకుంటోంది... ఒక‌వేళ మీరు ఏ కార‌ణం చేత శ్రీ రెడ్డికి మ‌ద్ద‌తు తెలుప‌కపోయినా, కానీ చేదోడు వాదోడుగా నిలుస్తార‌ని ఆశిస్తున్నాం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.