అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందొ తెలుసా ..!

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vani sree
Updated:  2018-09-10 04:28:04

అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందొ తెలుసా ..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీలో కూడా ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటి వాణిశ్రీ...అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి, ఈమె సుమారు 95 చిత్రాల్లో నటించింది.. నాలుగైదు బాషలలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉంది...అసలు ఏం చేస్తుంది...
 
వాణిశ్రీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుంటే ఈమె అసలు పేరు రత్నకుమారి. ఈమె నెల్లూరు జిల్లాలో పుట్టింది... వాణిశ్రీ కుటుంబ సభ్యులు ఒక్కనెలలోనే ముగ్గురు మరణించడంతో ఆర్ధికంగా దెబ్బతిన్నారు. టిబి వ్యాధి సోకి తండ్రి చనిపోతూ.. వాణిశ్రీ ని, ఆమె అక్క కాంతాన్ని బాగా చదివించాలని భార్య దగ్గర మాట తీసుకున్నాడు.
 
భర్తకిచ్చిన మాట ప్రకారం వాణిశ్రీ తల్లి మేకలు, ఆవులను మేపుతూ, వాటి పాలను అమ్ముతూ జీవనం సాగిస్తూ, వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కూతుళ్లను చదివించే ప్రయత్నం చేసారు. ఇందులో భాగంగానే మద్రాసు ఆంద్ర మహిళా సభకు వాణిశ్రీని, కాంతాన్ని పంపించారు. అయితే అక్క కాంతానికి చదువు బాగా అబ్బింది, కానీ వాణిశ్రీకి మాత్రం చదువుకంటే డాన్స్ పైనే ఎక్కువ మక్కువ ఏర్పడింది. భరత నాట్యం క్లాసులపై దృష్టి మళ్లింది. అలా 12ఏళ్ళ వయస్సులోనే స్కూల్ లో డాన్స్ చేస్తూ ఓ కన్నడ డైరెక్టర్ కంట పడింది. నటి సావిత్రిలా వుంది అని డైరెక్టర్ అనుకోవడంతో వాణిశ్రీకి తొలిసినిమా ఛాన్స్ దక్కింది. వాణిశ్రీ కన్నడ సినిమా సత్య హరిచ