శ్రద్ధా కపూర్ వల్లే సాహో షూటింగ్ లేట్ కానుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sradha kapoor
Updated:  2018-10-05 02:31:31

శ్రద్ధా కపూర్ వల్లే సాహో షూటింగ్ లేట్ కానుందా..?

శ్రద్ధా కపూర్ తెలుగు లో పరిచయం లేని పేరు అయిన కానీ, త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న పేరు.. ఇదివరకే బాలీవుడ్ లో ఎక్ విలన్, ఆషికి, ఒకే జాను లో నటించిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఇప్పుడు మన టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తో సాహో లో జాతకట్టబోతుంది..అయితే ఈ భామప్రస్తుతం సాహో తో పాటు హిందీలో సైనా నెహ్వాల్ పాత్రలో నటించబోతుంది..

ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకి వెళ్ళింది.. అయితే ఈ షూటింగ్ లో శ్రద్ధా కొంచెం అస్వస్థతకు గురైంది అని వార్తలొచ్చాయి.. టెస్ట్స్ చెయ్యగా డెంగ్యూ అని తేలిందంట.. ఇది ఇలా ఉండగా సహో లో శ్రద్ధా తో ఉన్న షెడ్యూల్ చివరి దశలో ఉండగా ఇలా జరగడం తో, సాహో సిబ్బంది కలవరపడుతున్నారంట..

ఈ భామ తో షెడ్యుల్ ముగియగానే యాక్షన్ సీన్స్ ప్లాన్ లో ఉన్నారట ఈ చిత్ర సిబ్బంది.. మన ప్రభాస్ సినిమా ఇప్పటికే లేట్ అయింది అని బాధపడుతుంటే ఇలాంటి న్యూస్ లు లేట్ ని పెంచేలా ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నాయి.. త్వరగా కోలుకుని షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని కోరుకుందాం..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.