"సాహో" కి పని చెయ్యడం చాలా కష్టంగా ఉంది అంటున్న ..హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas and sradha kapoor
Updated:  2018-09-11 05:00:50

"సాహో" కి పని చెయ్యడం చాలా కష్టంగా ఉంది అంటున్న ..హీరోయిన్

బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ "సాహో" సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ బాషల్లో ఈ సినిమా తెరకేక్కుతుండగా యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే "సాహో" కి పని చెయ్యడం చాలా కష్టంగా ఉంది అని శ్రద్ధ కపూర్ చెప్పుకొస్తుంది.

"ఈ సినిమా కోసం నేను తెలుగు ఇంకా హిందీ లో మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఎవ్వరి సహాయం లేకుండా నా సొంతగా నేనే డైలాగ్స్ చెప్తున్నాను. దీని కోసం రోజు మొత్తం కష్టపడాల్సి వస్తుంది. మొదట ఒక సీన్ ని నా కంఫర్ట్ ప్రకారం హిందీ లో తిసాక మళ్ళి అదే సీన్ ని తెలుగు లో తీస్తున్నారు, ఒక్కోసారి ఇంటికి వెళ్ళాక బెడ్ మీద పడుకుంటే నాకు మింద "సాహో" డైలాగ్స్ ఏ గుర్తొస్తున్నాయి.

"సాహో" కి పని చేస్తుంటే అదేదో రెండు సినిమాలకి పని చేసిన ఫీలింగ్ కలుగుతుంది" అని తన కష్టాన్ని చెప్పుకొచ్చింది శ్రద్ధ కపూర్. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ తో పాటు మరో బాలీవుడ్ నటి ఎవిలిన్ శర్మ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

షేర్ :