అల్లుడి మీద శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-09-17 11:46:45

అల్లుడి మీద శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పచ్చకామేర్లోచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు జనాలంతా శ్రీరెడ్డి గురించి ఆలోచించేటప్పుడు అంతా నెగటివ్ గానే చూడటం మొదలుపెట్టారు. ఆమె మంచి చెప్పిన అది వినే స్థితిలో ఎవరు లేరు పాపం. ఈ పాప ఇప్పుడు రివ్యూ రాణి అవతారం ఎత్తింది. తాజాగా విడుదల అయినా “శైలజా రెడ్డి అల్లుడు” మూవీ గురించి తన అభిప్రాయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది.

ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్, అది ఇది అంటూ ఉండే ఈ భామ ఇప్పుడు ఈ కొత్త అవతారమెత్తే సరికి సిని వర్గాల వారు నివ్వేరబోతున్నారు. ఇప్పుడు శ్రీ రెడ్డి చాలా సానుకూల దృక్పథంతో శైలజ రెడ్డి సినిమా పై ప్రశంసలు కురుపించింది. ఎందుకు ఏమిటి అనేది తెలియక పోయినా శ్రీరెడ్డి లాంటి వ్యక్తి నుండి కూడా “శైలజారెడ్డి అల్లుడు” ప్రశంసలు వచ్చాయి అంటే ఆ చిత్రం సక్సెస్ అయినట్టే.ఆమె 'పవర్ అఫ్ శైలజ రెడ్డి అంటూ తన ఫేస్బుక్ ద్వారా కామెంట్ పెట్టింది.

శైలజ రెడ్డి అల్లుడికి నా సపోర్ట్ అంటూ శ్రీ రెడ్డి తన మద్దతు పలికింది. ఇది సమంత టైం కాదు....నాగచైతన్య టైం. అతను బిగ్ హిట్ కొట్టే సమయం ఆసన్నమైంది. నా అభిమాన నటి రమ్యకృష్ణకు శుభాకాంక్షలు. కూల్ బాయ్ చైతుకి శుభాకాంక్షలు. అను ఇమ్మాన్యూయేల్ కి శైలజ రెడ్డి అల్లుడు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు' అంటూ చెప్పుకొచ్చింది. ఈమధ్య చెన్నయ్ కి మకాం మార్చిన ఈ భామ అక్కడ ఇఓ చిత్రంలో నటించే అవకాశం కూడా కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడీ మన తెలుగు ఇండస్ట్రీ మీద మనసులాగినట్టుంది పాపం అందుకే ఈ హడవిడంతా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.