రోడ్లమీదకు మానేసి కోర్టు ఎక్కిన శ్రీరెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-09-20 01:30:34

రోడ్లమీదకు మానేసి కోర్టు ఎక్కిన శ్రీరెడ్డి

ఎట్టకేలకు శ్రీరెడ్డి తన కాస్టింగ్ కౌచ్ విప్లవాన్ని ఒక సక్రమ మార్గం లో నడిపిస్తున్నట్లు కనబడుతుంది. ఇప్పుడు తన న్యాయపోరాటం కోర్ట్ లో ప్రారంభించడానికి రంగం సిద్దం చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక దోపిడీ నివారణకు కమిటి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు పలు కీలక తీర్పులు చేసింది.
 
సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మొట్టికాయలు వేసింది. ఇందుకు న్యాయ సేవాదికర సంస్థ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నది. సినీ పరిశ్రమలో లైంగిక దోపిడి పై తెలంగాణ ప్రభుత్వం బాధ్యత గా వ్యవరించాలని సూచించింది.ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో అంతర్గత విచారణ కోసం కమిటీలు వేయమని కోరింది.
 
లైంగిక దోపిడీ వ్యవహారంలో మహిళా కమిషన్ ఏమి చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి సినిమాటోగ్రఫీ, మహిళాభివృద్ధి, మహిళా కమిషన్, కార్మిక శాఖా, తెలంగాణ డిజిపి కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఇక పోతే ఇండస్ట్రీలో ప్రజలు ఇప్పటికైనా శ్రీరెడ్డి రోడ్లెక్కడం మానేసింది సంతోషం అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.