నెక్ట్స్ టార్గెట్ ఆ ద‌ర్శ‌కుడే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-12 16:34:02

నెక్ట్స్ టార్గెట్ ఆ ద‌ర్శ‌కుడే

కాస్టింగ్ కౌచ్  పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది శ్రీ రెడ్డి.... ఇటు  టాలీవుడ్‌లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలను మోసం చేస్తున్నారని  శ్రీరెడ్డి ఆరోపిస్తోంది.. ఇక ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ ద‌గ్గుబాటితో చ‌నువుగా ఉన్న ఫోటోలు, త‌న‌ను ఎలా వంచిచాడు అనేది ఆ ఫోటోల‌ను సాక్ష్యాలుగా బ‌య‌ట‌పెట్టింది అలాగే సింగ‌ర్ శ్రీరామ్ తో చాటింగ్ ను మ‌రో ద‌ర్శ‌కుడి పేరును బ‌య‌ట‌కు రివిల్ చేసింది ఈ భామ‌.
 
ఇక తాజాగా శ్రీరెడ్డి లీక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని ప‌లువురు ఆలోచ‌న‌లో ఉన్నారు... శ్రీరెడ్డి రెండు నెల‌లుగా పోరాటం చేస్తున్నా, ఏ పెద్ద సినీ ప్ర‌ముఖులు దీని పై మాట్లాడ‌లేదు, మా అసోసియేష‌న్ కూడా ఇప్పుడు క‌క్క‌లేక మింగ‌లేక అన్న చందంగా శ్రీరెడ్డి విషయంలో ఇరుక్కుంది...ఇండ‌స్ట్రీకి  పెద్ద‌గా ఉన్న నిర్మాత కుమారుడు, ఇటువంటి ప‌నిచేస్తే ఇక ఎలా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు... అయితే రెండు రోజులు అయినా ఈ విష‌యం పై ఏ పెద్ద న‌టుడు మాట్లాడ‌టం లేదు.
 
అయితే తాజాగా శ్రీరెడ్డి ఈ వారం మ‌రో బాంబ్  పేల్చ‌నుంది అని తెలుస్తోంది.. త‌న‌తో దారుణంగా ప్ర‌వ‌ర్తించిన వారి లిస్టును బ‌య‌ట‌పెడుతున్న శ్రీరెడ్డి, ఇప్పుడు స‌మాజానికి మంచి మెసేజ్ లు ఇచ్చే ఓప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి పేరు బ‌య‌ట‌పెట్ట‌నుందట... అంతేకాదు ఆద‌ర్శ‌కుడు సినిమా రిలీజ్ కావ‌డానికి రెడీ అవుతోంద‌ట... ఈ స‌మ‌యంలో ఆమె అత‌ని పేరు బ‌య‌ట‌పెట్ట‌నుంది అని తెలుస్తోంది.. మ‌రి స‌మాజానికి సోష‌ల్ మెసేజ్ ఇచ్చే ద‌ర్శ‌కుడు ఎవరో తెలియాలి అంటే శ్రీలీక్స్ ను ఫాలో అవుతూ ఉండండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.