శ్రీరెడ్డి- ప‌వ‌న్ టార్గెట్ వెనుక ఉన్న‌దెవ‌రు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-18 13:21:27

శ్రీరెడ్డి- ప‌వ‌న్ టార్గెట్ వెనుక ఉన్న‌దెవ‌రు ?

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి మీడియా ముందు చేస్తున్న పోరాటం తెలిసిందే ఇక సినీ ఇండ‌స్ట్రీలో ఓ పెద్ద నిర్మాత‌గా ఉన్న సురేష్ బాబు కుమారుడి తో తాను చ‌నువుగా ఉన్న ఫోటోలు బ‌య‌ట పెట్టి సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో కొత్త కోణం చూపించింది... నాణానికి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ వైపు చూశారు మ‌రో వైపు నేను చూపిస్తాను అని విమ‌ర్శ‌ల జోరు పెంచింది.కాస్టింగ్ కౌచ్ నుంచి కొత్త పందాని ఎంచుకుంది ఈ రెండు సినిమాల హీరోయిన్.
 
అయితే కాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పుడు ఏకంగా సినిమా వ్యాపారం వ‌ర‌కూ వ‌చ్చేసింది శ్రీరెడ్డి బ‌హుశా చిన్న ద‌ర్శ‌కులు నిర్మాత‌లు చిన్న సినిమాలు తీసే వారు త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తారు అని అనుకొని ఉండ‌వ‌చ్చు అయితే వారు ఎవ‌రూ శ్రీ శ‌క్తి వెనుక లేరు. స‌రిక‌దా మ‌ద్ద‌తు కూడా తెలుప‌లేదు
 
ఇక అసలు విష‌యానికి వ‌స్తే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి... ప‌వ‌న్ ని ఏమైనా  అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ప్ర‌జ‌ల కోసం ప‌వ‌న్ ఇంత క‌ష్ట‌ప‌డుతుంటే నీలాంటి బుర‌ద‌జల్లేవారి కామెంట్లు ఎవ‌రూ ప‌ట్టించుకోరు అని వారు ఫైర్ అయ్యారు.. ఇక తిట్ట‌కూడ‌ని-  విమ‌ర్శించ‌కూడ‌ని రేంజ్ లో శ్రీరెడ్డి ప‌వ‌న్ పై ఘాటు కామెంట్లు చేసింది. అదే ఇక్క‌డ అంద‌రూ గ‌మిన‌స్తున్నారు.. నాడు ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి ఉన్న ఈ కాస్టింగ్ కౌచ్ అప్పుడు మీడియా లేక ఉన్నా ఇంత విస్తృతంగా లేక అప్పుడు వెలుగులోకి రాలేదు.. అయితే ఇప్పుడు ప‌వ‌న్ దీనిపై స్పందించిమాట్లాడినందుకు త‌మఅనుకూల మీడియా ద్వారా మరింత ప‌వ‌న్ ని టార్గెట్ చేశారు.
 
ప‌వ‌న్ అన్నది ఒక‌టే పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లండి... న్యాయ‌బ‌ద్దంగా పోరాడండి అని చెప్పారు... దానికి శ్రీరెడ్డి ఇటువంటి స‌మాధానం ఇచ్చింది,  ప‌వ‌న్ లాంటి పెద్ద స్టార్ హీరోకే ఇటువంటి కామెంట్ వ్యాఖ్య‌లు చేస్తే, మిగిలిన వారిపై శ్రీ రెడ్డి మాట‌లు ఎలా ఉంటాయో అని  మిగిలిన హీరోలు కూడా దీనిపై త‌మ నిశ్శ‌బ్ద‌త‌ను కొన‌సాగిస్తున్నారు.
 
అయితే ప‌వ‌న్ ని టార్గెట్ చేయ‌డం వెనుక ఓ పెద్ద స్కెచ్ ఉంది అని తెలుస్తోంది... ఇప్ప‌టి వ‌ర‌కూ బాబు ఆస్ధాన మీడియాలు,  ప‌వ‌న్ సినిమాల నుంచి ప‌వ‌న్ మీటింగుల వ‌ర‌కూ ఓ రేంజ్ పబ్లిసిటీ ఇచ్చింది... ఎప్పుడు అయితే ప‌వ‌న్ చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్ బాబు పై అవినీతి ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌లు చేశారో, వెంట‌నే ప్లేటు ఫిరాయించారు..
 
శృతి త‌ప్పిన ప‌వ‌న్ అంటూ ఆ రోజే ప‌వ‌న్ పై  అక్క‌సు, బాబు పై ప్రేమ‌ను లైవ్ లో చూపించారు.. అయితే ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎద‌గ‌కూడ‌దు ప‌వ‌న్ పై ఏదో ఓ అభాండం వేయాలి ...అది కూడా మ‌హిళ‌ల చేత వేయిస్తే దాని విస్త‌ర‌ణ విస్తృతి మ‌రింత‌ ఎక్కువ‌గా ఉంటుంది, అలాగే  ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అవుతుంది... అందుకే శ్రీరెడ్డితో ఈ పొలిటిక‌ల్ క‌మ్ సినిమా వ్యాఖ్య‌లు కామెంట్లు చేయించారు, తెలుగుదేశం నాయ‌కులు అని అంటున్నారు..
 
కాదు అన‌డానికి లేదు, కేవ‌లం ఆ ఆ స్దాన మీడియాల‌లోనే ప‌వ‌న్ ని ఆమె దూషించిన వ్యాఖ్య‌లు పెద్ద‌గా వైర‌ల్ అవుతున్నాయి.. అలాగే మెగా ఫ్యామిలీని కూడా కాస్త అణ‌గ‌దొక్కాలి అనే ఉద్దేశ్యంకూడా ఉంది... దీనికి ప్ర‌ధాన కార‌ణం రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం  చిరుకి అయిపోవ‌డం, ఆయ‌న త‌మ్ముడికి మ‌ద్ద‌తుగా రాజ‌కీయాల్లో మ‌ళ్లీ జ‌న‌సేన ద్వారా వ‌స్తే.. త‌మ ప‌రిస్ధితి ఏమిటి అని తెలుగుదేశం ఆలోచ‌న‌లో ప‌డింది అని కొన్ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.. అయితే దీని వెనుక ఉన్న నాయ‌కులు అంద‌రూ బ‌య‌ట‌ప‌డ‌తారు అని అంటున్నారు ప్రజలు. 
 
శ్రీరెడ్డి శ్రీశ‌క్తి ఎన్ని శ‌క్తులు వ‌చ్చినా ప‌వ‌న్ శ‌క్తి ముందు తూచ్ అంటున్నారు ప్రజలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.