కొత్త అవ‌తారం ఎత్తిన శ్రీరెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-08-25 18:39:00

కొత్త అవ‌తారం ఎత్తిన శ్రీరెడ్డి

గత కొంతకాలంగా తెలుగు వార్తా ఛానళ్లు అన్ని ఉసూరుమంటూ ఉప్పుకారం లేని ఆవకాయలా చప్పగా ఉన్నాయేంటి అని మీకు అనుమానం ఈపాటికే వచ్చేసుండాలి. అటు కత్తి మహేశ్ మీద బహిష్కరణ వేటు, ఇటు శ్రీరెడ్డితో ఇక ప్రయోజనం లేదనుకున్న పెద్దమనుషుల వల్ల ఈ వార్త ఛానెళ్ల పరిస్థితి స్టఫ్ లేని సిట్టింగ్ లా మారింది.
 
అదంతా సరే, ఇంతకీ సదరు “శ్రీ శక్తి” గారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానంఎక్కడా అనుకుంటున్నారా? దొరికేసింది లెండి. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడిన తర్వాత ఆమె మీద ఆమెను చూపించే ఛానెళ్ల మీద పవన్ అభిమానులు పరిశోధనలు మొదలెట్టారు. తీగ లాగితే డొంక అంత కదులుద్దేమో అని భయపడిన సదరు చానెళ్లు ఈమెను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఈ పాపకి పనిలేకుండా పోయింది. హైదరాబాద్ లో ఇక మన పని అయిపోయింది అనుకున్న సదరు మహిళ శక్తి గారు తమ టాలెంట్ ని తమిళంలో ప్రదర్శించపునారు.
 
అయితే తమిళ తంబీలకు ఐకమత్యం ఎక్కువగా ఉండటంవల్ల అక్కడ ఈ పాప పప్పులు ఉడకలేదు. అయితే ఒక్క అవకాశం ఇస్తాం అనడంతో సై అంటూ సంతకం పెట్టేసింది. “రెడ్డిడైరీ”  అని టైటిల్ పెట్టి మరీ సినిమా తీస్తున్నరంటా తమిళతంబీలు. టైటిల్ చూసి అది ఆమె బయోపిక్ అనుకున్నవాళ్ళు లేకపోలేదు. ఆ సినిమాలో ఆమెది ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర మాత్రమేనట. నిజానికి అది ఒక తమిళ హీరోయిన్ బయోపిక్ అని నిర్మాతలు ప్రకటించేశారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.