దగ్గుపాటి వార‌సుడి పేరు లీక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

daggubati abhiram sri reddy photos
Updated:  2018-04-11 01:20:51

దగ్గుపాటి వార‌సుడి పేరు లీక్

న‌టి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయంటూ ట్వీట్ చేసి సంచ‌ల‌నంగా మారిన‌ సంగ‌తి తెలిసిందే... అయితే ఇప్ప‌టికే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల నాచుర‌ల్ స్టార్ నాని పేర్ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది శ్రీరెడ్డి.. దీంతో పాటూ మా సంస్థ త‌రుపున త‌న‌కు స‌భ్య‌త్వం కార్డు ఇవ్వాలంటూ అర్థ‌న‌గ్నంతో నిర‌స‌న‌తెలిపి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది శ్రీరెడ్డి.
 
అయితే ఈ క్ర‌మంలో శ్రీరెడ్డి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో త‌న‌తో చాట్ చేసిన ప్ర‌ముఖ నిర్మాత కుమారుడు త‌న‌ను వాడుకుని వ‌దిలేశాడ‌ని పేర్కొంది... ఇదే విష‌య‌న్ని ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ కు  నేను ఆ ఫోటోల‌ను ఇచ్చాను.. మీరు దమ్ముంటే ఆఫోటోల‌ను టెలికాస్ట్ చేయండి అంటూ స‌వాల్ చేసింది శ్రీ రెడ్డి ... అయితే స‌ద‌రు ఛాన‌ల్ అత‌ని ఫోటోను ఫేస్ మార్ఫింగ్  చేసి టెలికాస్ట్ చేశారు.
 
దీంతో శ్రీరెడ్డి ఆ స్డూడియో నుంచి బయటకు వెళ్లి వెంట‌నే ఇంకొక ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ వెళ్లి ఆఫోటోల‌ను వారికి అప్ప‌జెప్పింది... ఆమె కోరిక మేర‌కు స‌ద‌రు ఛాన‌ల్ స్పందించి ఆ ఫోటోల‌ను టెలికాస్ట్ చేసింది.. ఇంత‌కు ఆ ఫోటోలో ఉన్న వ్య‌క్తి  ఎవ‌రంటే ప్ర‌ముఖ నిర్మాత  సురేష్‌ బాబు కుమారడు, నటుడు రానా తమ్ముడు అయిన అభిరామ్‌ దగ్గుబాటి. 
 
అభిరామ్ అనే వ్య‌క్తి త‌న తండ్రి చొర‌వ‌తో అనేక మంది అమ్మాయిల‌ను విచ్చ‌ల‌విడిగా వాడుకున్నార‌ని శ్రీరెడ్డి తెలిపింది... తాను ప్రాణాల‌కు తెగించి ఈ ఫోటోల‌ను టెలికాస్ట్ చేయించానని ఇప్పుడు మ‌హిళా సంఘాలు త‌న‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని కోరింది.. నిర్మాత సురేష్ కొడుకే కాకుండా త‌న వ‌ద్ద‌ ఇంకా కొంత మంది ఫోటోలు ఉన్నాయ‌ని అవికూడా త్వ‌ర‌లో మీడియాకు ఇస్తాన‌ని చెప్పింది శ్రీరెడ్డి.
 
ఈ క్ర‌మంలో శ్రీ రెడ్డికి సోష‌ల్ మీడియాలో అనేక మంది మ‌హిళా సంఘాలు మ‌ద్ద‌తుగా నిలుస్తొన్నారు.. ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని స్డూడియో కట్టుకుని అక్కడ అమ్మాయిలను నాశనం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్ప‌టికైనా పోలీసులు స్పందించి వెంట‌నే ద‌గ్గుపాటి అభిరామ్ ను అరెస్ట్ చేయాల‌ని కోరుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.