మహానటి మీద శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-09-28 01:22:18

మహానటి మీద శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు తెలుగు టీవీ న్యూస్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన వివాదాల శ్రీరెడ్డి కొన్ని తాయిలాలు ముట్టడంతో చెన్నై పోయి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ ప్రశాంతంగా ఉంది అని పలువురు సంతోషంగా కూడా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈమె తమిళనాట అడుగుపెట్టి అక్కడ కూడా కెలకడం మొదలుపెట్టేసింది.

అక్కడి దర్శకులు నిర్మాతలపై కామెంట్స్ చేసి రెండుమూడు అవకాశాలు కూడా దక్కించుకుంది. “రెడ్డి డైరీ”  అనే చిత్రం లో నటిస్తుందని ఆ మధ్య ఒక సినిమా పేరు బయటకి కూడా వచ్చింది.  గత కొంతకాలంగా సైలెంటుగా ఉన్న ఈ పాప ఇప్పుడు మల్లి తన ఫేస్బుక్ లో హడావిడి చెయ్యడం మొదలు పెట్టింది. “మహానటి”  లో నటించిన కీర్తి సురేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన గురించి హీరో విశాల్ మాట్లాడుతున్నపుడు కీర్తి సురేష్ వెకిలిగా నవ్విందని - ఏదో ఒకరోజు తనలాంటి వారి బాధలు కీర్తికి అర్థమవుతాయని శ్రీరెడ్డి చెప్పింది.

ఇపుడు కీర్తి సురేష్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి కనుక ఏమీ అర్థం కావడం లేదని....అన్ని రోజులు ఒకలా ఉండవని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  కీర్తి సురేష్ వెకిలి నవ్వు చూసి తనకు ఆమెపై అసహ్యం వేసిందని - ఇపుడు ఆమె టైమ్ బావుంది కాబట్టి మేఘాల్లో తేలిపోతోందని వ్యాఖ్యానించింది. కీర్తి ఎప్పుడూ ఇలాగే ఉండదని - ఏదో ఒకరోజు స్ట్రగులర్స్ బాధ తనకు అర్థమవుతుందని చెప్పింది. తన గురించి పాజిటివ్ గా స్పందించిన విశాల్ కు ధన్యవాదాలని - కానీ - తన చుట్టూ ఉన్న వారు కెమెరాలు ఎందుకు పెట్టుకోవాలన్నారో అర్థం కాలేదని చెప్పింది. కానీ జనాలకు అర్ధం అయ్యింది లే!!!!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.