శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-10 13:10:46

శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌ను ఒక‌టి త‌రువాత ఒక‌టి త‌న అకౌంట్ లో లీక్ చేస్తూ సంచ‌ల‌నంగా మారుతోంది న‌టి శ్రీ రెడ్డి... అయితే ఇప్ప‌టికే త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల, అలాగే హీరో నానీల పేర్లు ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన శ్రీ రెడ్డి... మొన్న‌టికి మొన్న త‌న‌కు మా స‌భ్య‌త్వం కార్డు అలాగే తెలుగు హీరోయిన్ ల‌ను ప్రోత్స‌హించాల‌ని అర్ధ‌న‌గ్నంతో నిర‌స‌న తెలిపిన‌ సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతోంది... ఈ పోస్ట్ లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టుల‌నే కాకుండా, రాజ‌కీయ నాయ‌కుల‌పై కూడ సంచ‌ల‌న ట్వీట్ చేసింది.. గ‌తంలో కూడా త‌న‌కు రాజ‌కీయ నాయ‌కులు స‌పోర్ట్ కావాల‌ని ట్వీట్ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు మ‌రోసారి రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌స్తావిస్తూ ఒక ట్వీట్ పెట్టింది శ్రీరెడ్డి..
 
ఇంత‌కూ శ్రీరెడ్డి ఏమ‌ని ట్వీట్ చేసిందంటే... గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక యువనటి న్యాయాన్ని అర్థిస్తూ బట్టలు విప్పుకుని, నగ్నంగా నిలబడే స్థాయికి దేశాన్ని దిగజార్చిన రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు సిగ్గు పడాలని,ముఖ్యంగా  చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్ని కాదని, జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను చూడాలని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.