శ్రీకాంత్,శివాజీ రాజాల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy controversy
Updated:  2018-09-05 03:40:48

శ్రీకాంత్,శివాజీ రాజాల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వివాదాల శ్రీ రెడ్డి మళ్ళీ తెరమీదకు విచ్చేసింది. “మా” లో జరుగుతున్న అవకతవకల మీద తన గళాన్ని వినింపించి అందరి చూపు తనవైపు తిప్పుకునే ప్రయత్నం మళ్ళీ చేస్తుంది. ఇటీవల ‘మా’ లో డబ్బు గోల్ మాల్ అయిన సంగతి అందరికీ విధితమే.తాజాగా శ్రీరెడ్డి, శివాజీ రాజా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మొన్నటివరకు సైలెంట్ గానే ఉన్నప్పటికీ ఎప్పుడెప్పుడు తన ఉనికిని చాటుకుందామ అన్నట్టు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమెకి ఈ వివాదం ఒక మంచి అవకాశం అయ్యింది.
 
నిప్పులు చేరుగుతూ తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.తన పేరెంట్స్ ని పట్టించుకోనోడు వేరే వృద్దులకు ఆశ్రమం కట్టిస్తాడట అంటూ ఎగతాళిగా వెక్కిరించింది. నా కడుపు మంది నేను ఆవేదన వెలిబుచ్చితే డబ్బున్నోళ్ల పంచన చేరి బ్రోకర్ పనులకు సైతం వెనకడలేదు తను అంటూ అనూచిత వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. శివాజీ రాజా ఒక్కడే అనుకుంటే ఇప్పుడు తనతోపాటు శ్రీకాంత్ జతకట్టడాని వాపోయింది. వాళ్ళిద్దరివల్ల ఇప్పుడు మా కి దరిద్రపు గతి పట్టిందంటు విరుచుకుపడింది.
 
ఆ బిల్డింగ్ నిర్మాణానికి జరిగిన నిధుల సేకరణ లో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది శ్రీరెడ్డి. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆమె బాంబు పేల్చారు. USA లో మా కి కోటి రూపాయలు మాత్రమే వచ్చాయని మిగతవన్ని వీరు తినేసుంటారని ఆరోపించారు శ్రీరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.