శ్రీరెడ్డి నీచ‌మైన వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-17 17:08:09

శ్రీరెడ్డి నీచ‌మైన వ్యాఖ్య‌లు

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో విచ్చ‌ల‌విడిగా మ‌హిళ‌ల‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాను వేదికగా చేసుకుని న‌టి శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.. అయితే ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు, అభిరామ్ ద‌గ్గుపాటి పేరు బ‌య‌ట పెట్టింది శ్రీరెడ్డి.. త‌న‌తో చ‌నువుగా వున్న ఫోటోల‌ను సాక్షాల‌తో  స‌హా మీడియాలో అంద‌జేసింది శ్రీ రెడ్డి.
 
తాజాగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ల్లి పై ప‌లు వ్యాఖ్య‌లు చేసి క‌త్తి మ‌హేష్ క‌న్నా సెన్సెష‌న‌ల్ గా మారిపోతోంది శ్రీరెడ్డి.... ఇక‌ ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని శ్రీరెడ్డికి రీ కౌంటర్ ఇస్తున్నారు.. మా దేవుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ల్లి మాకు దేవ‌త లాంటి వారిపై మీరు కామెంట్ చేయ‌డం చాలా అస‌హ్యంగా వుంద‌ని ట్వీట్ చేస్తున్నారు. 
 
ఇక తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను చేసిన వ్యాఖ్య‌ల‌పై శ్రీరెడ్డి స్పందించారు... వావ్... ఈ రోజు అర్థమైంది. మా లేడీస్ కు ఉన్న ఇండిపెన్డెన్స్ గురించి. అమ్మాయిలు నోరు తెరిస్తే, మీ గూండాగిరి... ఒక అమ్మాయి నంబర్ యూట్యూబులో, వాట్స్ యాప్ గ్రూపుల్లో పెట్టి హింస పెట్టే పెద్ద మనుషుల్లారా... మీ లాగా ఎవరూ టార్చర్ చేయలేరని నిరూపించారు... పీకే ఫ్యాన్స్ చేసే ఈ చిల్లర పనుల వల్ల ఎంత నష్టమో చూపిస్తాం. నేను ఒక్కదాన్ని. మీరు ఎంత మందో. ఒక ఆడదాన్ని ఏడుపుకు రాజ్యాలు కూలిపోయాయి. ఉసిగొల్పితే పోయేది మీ పరువు తప్ప నాకేం కాదు. ఈ పురుషాధిక్యత ఎంత కాలమో చూస్తాం  అని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.
 
మరో పోస్టులో పెడుతూ.. చదువుకున్న కొంతమంది నీచులారా, మూర్ఖులారా, మీ బుర్రకి క్లీనింగ్ స్పిరిట్ తో అభిషేకం చేయండి. రోగానికి మందు వేసుకోండి. అభిమానం ముసుగులో మీరు చేసే అకృత్యాలకు ఎవరం భయపడం. పంజా విసురుతాం అన్యాయాలపై, అసమానతలపై... మీ నేత అస్తమించే టైమ్ దగ్గర్లోనే ఉంది. ఒక నిస్సహాయ ఆడపిల్ల మీద ఎంత జులుమో చూస్తాం. పవన్ కంట్రోల్ చేయకపోతే దీన్ని తేలికగా తీసుకునేది లేదు అని హెచ్చరించింది. నా జీవితంలో అనుభవించిన బాధ కన్నా, మీరు తిట్టే తిట్లు నా... తో సమానం. తెగించి వచ్చా అంటూ ట్వీట్ చేసింది శ్రీ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.