స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:26:41

స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి

ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది శ్రీ రెడ్డి. అసలు ఏ నిమిషం లో ఎవరి గురించి లీక్ చేస్తుందో అంటూ శ్రీ రెడ్డితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు అందరూ భయపడుతున్నారు. అయితే ఇటివలే బిగ్ బాస్ సామ్రాట్ పై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన మురగదాస్ పై పడింది.

శ్రీ రెడ్డి మురగదాస్ గురించి మాట్లాడుతూ "మురుగదాస్ గారు మనిద్దరం గ్రీన్ పార్క్ హోటల్ లో కలిసాం , నన్ను రచయిత వెలిగొండ శ్రీనివాస్ మీకు పరిచయం చేసాడు. ఆ హోటల్ లో మనం కలుసుకున్న సమయంలో నాకు తప్పకుండా ఛాన్స్ లు ఇస్తానని మాటిచ్చారు నేను నమ్మాను కానీ ఇప్పటివరకు కూడా మీ నుండి నాకు కాల్ ఇంతవరకు రాలేదు.

మీరు చాలా గ్రేట్ సార్ అంటూ" ట్వీట్ చేసి మరోసారి ఫిలిం నగర్ లో చర్చకు దారి తీసింది. అసలు శ్రీ రెడ్డి లాంటిది తమిళ స్టార్ దర్శకుడు అయిన మురుగదాస్ పై ఆరోపణలు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇన్ని రోజులు శ్రీ రెడ్డి తెలుగు వాళ్ళనే టార్గెట్ చేస్తుంది అని అనుకున్నారు అంతా కాని ఇప్పుడు ఈ భామ తమిళ హిందీ స్టార్స్ ని కూడా వదిలిపెట్టడం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.