పవన్ పై “శ్రీశక్తి” మళ్ళీ యుద్ధం ప్రకటించనుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and sri reddy
Updated:  2018-09-29 11:31:39

పవన్ పై “శ్రీశక్తి” మళ్ళీ యుద్ధం ప్రకటించనుందా..?

అప్పటివరకు తారాస్థాయిలో సాగిన శ్రీరెడ్డి ఉద్యమం పవన్ కళ్యాణ్ ని, అతని తల్లిని అనరాని మాటలు అనడం తో నీరుగారిపోయింది. తనకి అన్ని విధాలుగా మద్దతు తెలిపిన ఎంతో మంది మహిళలు, ఉద్యమ కారులు ఆమె అన్న మాటలతో ఏకీభవించలేదు. తనని ఏకాకిని చేసి వదిలేసి ఉద్యమం మధ్యలో వెళ్లిపోయారు. అంతే కాదు… పవన్ అభిమానులు ఆయన్ని అంటే అస్సలు ఊర్కుకోరు.
 
అలాంటిది అతన్ని తన తల్లిని అనరాని మాటలు అంటే ఊరుకుంటారా..? ఇల్లుపీకి పందిరేసినంత పని చేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆమె వెనకాలున్న వారిని కూడా బయటకి లాక్కొచ్చారు. ఆ తర్వాత శ్రీరెడ్డి మాట రాష్ట్రంలో వినబడలేదు. ప్రస్తుతం శ్రీరెడ్డి హీరోయిన్ గా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది.. ప్రస్తుతం ఆమె చెన్నైలో షూటింగ్ లో ఉంది. పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరుపున రాజకీయ పోరాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఇటీవల ఆయన తన ప్రసంగంలో 'ఎవరు ఎవరి దగ్గరో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట' అంటూ చేసిన వ్యాఖ్యలు శ్రీరెడ్డి కి తగిలాయి.పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి యూత్ అంతా  ఇన్స్పైర్ అవుతారు, ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయమన ఇలా మాట్లాడటం సరి కాదు అని శ్రీరెడ్డి వాపోయింది.  
ఒక భాత్యాతయుతమైన రాజయకీయ నాయకుడిగా ఆడపిల్లకి అండగా నిలవలసింది పోయి ఎవరు ఎవరితోనో పడుకుంటే నేనొచ్చి సమాధానం చెప్పాలా? అంటూ చేసిన కామెంట్స్ శ్రీరెడ్డి అస్సలు సహించుకోలేకపోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.