ఎన్టీఆర్ ని చూసి తొడ కొట్టమంటున్న శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-10-15 03:54:13

ఎన్టీఆర్ ని చూసి తొడ కొట్టమంటున్న శ్రీ రెడ్డి

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే. ఈ సినిమా గురించి అందరిలానే శ్రీ రెడ్డి కూడా తనదైన శైలిలో పొగడటం మొదలెట్టింది. ఎన్టీఆర్ కటౌట్ ను షేర్ చేస్తూ ఇంకెందుకు ఆలస్యం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ తొడ కొట్టండి సినిమా చాలా బావుంది అంటూ ట్వీట్ చేసింది.

ఇక త్రివిక్రమ్ సినిమాలో ఆడవాళ్ళ గురించి బాగా చెప్పారు అని చెప్పుకొచ్చింది. ఇక కాస్టింగ్ కౌచ్ పైన కొన్నాళ్ళు మౌనం వహించిన ఈమె ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టింది.టి ఆర్ ఎస్. ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి ఆమెను రాత్రికి రమ్మని కోరాడని, ఈమె నిరాకరించడంతో అతను బెదిరించాడని చెప్పుకొచ్చింది.

ఇక వన్ కళ్యాణ్ తో గొడవ తరువాత మెగా హీరోలు అందరిని తిట్టిపోస్తున్న శ్రీ రెడ్డి నందమూరి హీరోలను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంది. ఎన్టీఆర్ ని పొగుడుతుంది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వట్లేదు. ఇక ఈమె తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండిస్ట్రీ నుండి దూరమైన ఈమె కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

షేర్ :