శ్రీరెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-13 15:31:00

శ్రీరెడ్డి ట్వీట్

తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో  అనేక మంది మ‌హిళ‌ల‌పై లైంగిక‌ వేధింపులు జ‌రుగుతున్నాయంటూ గ‌త కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక‌టి త‌ర్వాత ఒక‌టి లీక్ చేస్తూ సెన్సేష‌నల్ క్రియేట్ చేస్తోంది న‌టి శ్రీరెడ్డి... సినిమా అవ‌కాశాల పేరుతో నిర్మాత మొద‌లుకుని చిన్న‌పాటి అసిస్టెంట్ వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రు అమ్మాయిల‌ను లైంగికంగా వేదిస్తున్నార‌ని శ్రీ రెడ్డి తెలిపింది. 
 
అయితే ఇప్ప‌టికే ప్ర‌ముఖనిర్మాత సురేష్ బాబు కుమారుడు, హీరో రానా త‌మ్ముడు అభిరామ్ ద‌గ్గుపాటి శ్రీరెడ్డితో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ను, ఇత‌ను సినిమా అవ‌కాశాల‌పేరుతో త‌న‌ను ఎలా వంచించుకున్నాడో ప్ర‌తీ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పేర్కోంది శ్రీ రెడ్డి. అలాగే  ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ కూడా త‌న‌ను వాడుకున్నాడ‌ని చెప్పింది శ్రీరెడ్డి.
 
ఇక తాజాగా ప్ర‌ముఖ‌ ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు పేరు శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టింది... చూడ‌డానికి పెద్ద మ‌నిషిలా క‌నిపిస్తున్నా కానీ వాకాడ అప్పారావు వందలాది మంది అమ్మాయిలను వాడుకున్నాడని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.. సినిమా అవ‌కాశాలు కోసం వ‌చ్చిన 16 సంవ‌త్స‌రాల అమ్మ‌యిల‌ను కూడా ఇత‌ను వ‌దిలి పెట్ట‌ర‌ని తెలిపింది...మెగా స్టార్ చిరంజీవి గారు ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి అంటూ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.