హవ్వ ...శ్రీదేవి కూతురేనా అస్సలు ???

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 02:33:39

హవ్వ ...శ్రీదేవి కూతురేనా అస్సలు ???

అతిలోక సుందరిలా మనందిరిని మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ముద్రను భారత చలన చిత్ర పరిశ్రమ వేసి వెళ్ళిపోయింది శ్రీదేవి. ఆవిడ సినిమాల్లో ఉన్నంత కాలం అభిమానుల గుండెల్లో ఆరాధ్య దేవతగానే నిలిచింది. తన నటనలో కానీ కట్టు బొట్టు లో కానీ  ఎక్కడా కూడా అసభ్యకరమైన విధంగా కనిపించకపోవడం ఆమె విజయానికి ఒక రకంగా కారణం.
 
ఇప్పుడు ఆమె మన మధ్యలేదు. కానీ ఆవిడా గారాలపట్టి పెద్దకూతురు ‘జాన్వీ కపూర్’ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. దఢక్ అనుకున్నంత విజయం సాధించకపోయినప్పటికీ జాన్వికి మంచి పేరునే సంపాదించిపెట్టింది. కానీ ఇప్పుడు ఆమె తీరును పలువురు నెటిజన్లు తప్పు బడుతున్నారు.
 
ఆమె కట్టు బొట్టు బొత్తిగా ఎవ్వరికి నచ్చడం లేదు సరికదా ఆమెను విమర్శల పాలు చేస్తున్నాయి.  తాజాగా ఆమెకి సంబంధించిన ఒక చిత్రం అంతర్జాలంలో హల్చల్ చేస్తుంది. అత్యంత కురచ బట్టలతో ఆమె ఈ చిత్రంలో తారసపడింది. శ్రీదేవి కూతురు అంటే ఎలా ఉండాలి?? ఎలా ఉంది ? అంటూ నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు.  కానీ ఇవేమి తనకు పట్టనట్టే వ్యవహరిస్తోంది జాన్వీ పాప. బహుశా ఆమె దఢక్  హిట్ అయ్యిందనే భ్రమలోనే బతికేస్తున్నట్టుంది. అందుకే కరణ్ జోహార్ ఈమె మీద ప్రత్యక శ్రద్ధతీసుకుని మరీ రెండవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.