అందాల తార సినీనటి శ్రీదేవి ఇక‌లేరు...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine-sridevi
Updated:  2018-02-25 10:42:36

అందాల తార సినీనటి శ్రీదేవి ఇక‌లేరు...

అందాల తార  యువ‌కుల మ‌న‌సుల‌ను త‌న న‌ట‌న‌తో కొళ్ల‌గొట్టిన తార సినీ సితార... మ‌నంద‌ర‌ముందు త‌న చిరున‌వ్వుతో అభిమానుల హృద‌యాల‌ను చూర‌గొన్న‌ న‌టి, శ్రీదేవి తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు.. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె, తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ ధ్రువీకరించారు.
 
శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు వెల్ల‌డించారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు !! శ్రీ అమ్మా యాంగేర్‌ అయ్యపాన్ !! తమిళ్‌, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
1975 చిన్నతనంలో తునాయివన్‌ సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం !! మా నాన్న నిర్దోషి!!  అలా ఆమె తెలుగులో అనేక సినిమాల్లో న‌టించారు.. అల‌నాటి అగ్ర‌న‌టులు అంద‌రితో ఆమె న‌టించారు. ఆమె సినిమాల కోసం నిర్మాత‌లు క్యూక‌ట్టిన సంద‌ర్బాలు ఇప్ప‌టికీ ఉన్నాయి. శ్రీదేవి తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.
 
2017లో చివరిగా మామ్  చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు శ్రీదేవి. బాలీవుడ్‌లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు ఆమె.... శ్రీదేవి-బోనికపూర్‌ దంపతులకు ఇద్ద‌రు పిల్ల‌లు, వారే జాన్వీ, ఖుషిలు... ఇటీవ‌లే ఆమె పెద్దమ్మాయి జాహ్నవి సినిమా రంగానికి ప‌రిచయం చేయాలి అని శ్రీదేవి నిర్ణ‌యించారు....
 
ప్ర‌స్తుతం  ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.. ఆమె మ‌ర‌ణంతో క‌పూర్స్ ఫ్యామిలీ శోక‌సంద్రంలో ఉంది.సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.. ఆమె ప‌లు భాషల్లో సినిమాల్లో న‌టించ‌డంతో ఆమెకు దేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు.. ఆమె మృతితో  ఒక్క‌సారిగా టాలీవుడ్ -బాలీవుడ్ - కోలీవుడ్ లో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.