నితిన్ ని ఈ సినిమా కోసం తీసుకోవద్దు అన్నారు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nithin hero
Updated:  2018-07-24 01:28:24

నితిన్ ని ఈ సినిమా కోసం తీసుకోవద్దు అన్నారు అంట

నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "శ్రీనివాస కళ్యాణం". పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో నితిన్ ని హీరోగా తీసుకునే టైం లో చాలా మంది నితిన్ ని హీరోగా వద్దు అని చెప్పారు అట.ఎందుకంటే ఇందులో పెళ్లి, మంత్రాలకు సంబంధించిన డైలాగులు నితిన్ సరిగా పలకలడో లేదో చూసుకోమని సతీష్ కి చాలా మంది చెప్పారు అట.

అయితే తానా మాటల్ని పట్టించుకోలేదని ఈ సినిమా క్లైమాక్స్‌లో అయిదు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో అద్భుతంగా చేశాడని.. డైలాగులు కూడా చాలా బాగా చెప్పాడని. ఆ రోజు మొత్తం యూనిట్ సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారని సతీశ్ తెలిపాడు.

నితిన్ ఈ సినిమా ద్వారా నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు అని నేను ఖచ్చితంగా చెప్తాను అనే ధీమా వ్యక్తం చేసాడు సతీష్ వేగ్నేశ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగష్టు 9 న రిలీజ్ అవుతుంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.