పకడ్బందిగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dilraju
Updated:  2018-08-08 12:54:21

పకడ్బందిగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసిన దిల్ రాజు

దిల్ రాజు బ్యానర్ లో యువ కథానాయకుడు నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం "శ్రీనివాస కళ్యాణం", "శతమానం భవతి" ఫేమ్ అయినా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా ఈ శ్రావణ మాస సీజన్ లో పెళ్ళిచేసుకునే వధువరులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనున్నాడుట నిర్మాత దిల్ రాజు, అదేంటంటే పెళ్లి చేసుకునే నూతన జంటకు "శ్రీనివాస కళ్యాణం" టీం పెళ్లి బట్టలు ప్రకటించనున్నట్లు దిల్ రాజు తెలిపాడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "‘ఆగస్ట్ 9 మాకు చాలా సెంటిమెంట్. "బొమ్మరిల్లు" తర్వాత 12 ఏళ్లకు మళ్లీ ఈ డేట్ కుదిరింది. డేట్ ఫిక్స్ అవగానే సతీష్ ఓ విషయం చెప్పారు. ‘శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి.

ఆ జంటలకు పట్టు వస్త్రాలు ఇస్తే బాగుంటుంది’ అన్నారు. ఈ విషయమై వారం క్రితం కళామందిర్ కల్యాణ్‌కు చెప్పగానే ‘మేము మీ టీంకు సహకరిస్తాం’ అని ముందుకొచ్చారు. శ్రావణమాసంలో పెళ్లిళ్లు చేసుకోబోతున్న జంటలకు పట్టువస్త్రాలు అందిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే జంటలు మీ వెడ్డింగ్ కార్డ్ మాకు ఫేస్‌బుక్ ద్వారా పంపిస్తే మీ అందరికీ పట్టు వస్త్రాలు పంపిస్తాం. కొందరికి మా టీం స్వయంగా వచ్చి ఇస్తుంది’’ అని దిల్ రాజు తెలిపారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.