పెళ్లి పీట‌లెక్క‌నున్న శ్రియ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-06 03:28:21

పెళ్లి పీట‌లెక్క‌నున్న శ్రియ‌

ఇష్టం సినిమాతో  హీరోయిన్ గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది శ్రియ శ‌ర‌న్... ఇష్టం సినిమా ద్వారా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై త‌క్కువ స‌మ‌యంలో అగ్ర హీరోల సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది... ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ  తెలుగులోనే  సుమారు 50కు  పైగా చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించారు శ్రియ‌.అయితే ఈ వ‌య్యారి భామ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లోను ప‌లు చిత్రాల‌లో న‌టించింది.
 
తాజాగా ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఒక వార్త వైర‌ల్ అవుతోంది... శ్రియ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్నార‌ని, మార్చి చివ‌రి వారంలో వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.. ర‌ష్యాకు చెందిన ఓ యువ‌కుడితో శ్రియ కొద్ది కాలంగా స్నేహంగా ఉంటోంద‌ని, ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మార‌డంతో ఒక‌రికొక‌రు పెళ్లి చేసుకునేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌... ఈ నేప‌థ్యంలో ఆ యువ‌కుడి త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించేందుకు శ్రియ ర‌ష్యాకు వెళ్లింద‌ట‌... వారు ఒకే చెబితే రాజ‌స్థాన్ లో వీరి పెళ్లి  చేసుకుంటున్నారంటు టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.