త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన శృతిహ‌స‌న్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 02:48:23

త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన శృతిహ‌స‌న్‌

తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ... వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకుని..... త‌న‌దైన శైలిలో  న‌టిస్తున్న క‌థానాయిక శృతిహ‌స‌న్‌. అన‌గ‌న‌గా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది ఈ అమ్మ‌డు. అయితే ఓ మై ఫ్రెండ్‌, గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది న‌టి శృతిహ‌స‌న్‌. త‌న న‌ట‌న, అందంతో అవ‌కాశాలు అందిపుచ్చుకుని  అతి త‌క్కువ స‌మ‌యంలో అగ్ర స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.
 
ఈ అమ్మ‌డు పాడే పాట‌ల‌కు ఎవ‌రైన ఫిదా అవ్వాల్సిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సైతం న‌టించిన  శృతిహ‌స‌న్‌కు ప్ర‌స్తుతం ఎక్క‌డా అవ‌కాశాలు లేవు. ఈ స‌మ‌యంలో భాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కొర్సలేతో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ.... తరచూ అందరి కంటా పడుతోంది శృతిహ‌స‌న్‌. ఇటీవల జరిగిన ఒక‌ పెళ్లికి వీళ్లిద్ద‌రు దక్షిణాది సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొబోతున్నారు అందుకే శృతి న‌ట‌న‌కు దూరంగా వుందని చెబుతున్నారు.
 
దినికి శృతిహ‌స‌న్ స్పందిస్తూ.... నేను ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదు.పెళ్లి కోసం వృత్తిపరమైన జీవితాన్ని వ‌దులుకొను. పెళ్లి త‌రువాత మ‌హిళ‌లు ఉద్యోగాలు వ‌దిలేయాల‌ని అనుకునే వాళ్ల‌కు మ‌హిళ‌ల అలోచ‌న‌లు, సామ‌ర్ధ్యాలు తెలిసుండ‌వ‌న్నారు.  శ్రుతి పెళ్లి తర్వాత కూడా నటిస్తాన‌ని పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.