షూటింగ్ కి మద్యం తాగి వస్తున్న స్టార్ కమెడియన్ పై వేటు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

star comedian vadivelu
Updated:  2018-09-17 15:08:54

షూటింగ్ కి మద్యం తాగి వస్తున్న స్టార్ కమెడియన్ పై వేటు

తెలుగు తమిళ భాషలలో తనకంటూ ఒక ప్రత్యకమైన స్థానాన్ని సంపాదించుకున్న హాస్యనటుడు వడివేలు గారు. తెలుగునాట బ్రహ్మానందం గారిని ఎలా చూడగానే నవ్వుకుంటామో అదే విధం గా తమిళ తంబీలకు వడివేలు నవ్వులు తెప్పిస్తారు. ఆయన అక్కడ టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఒకానొక దశలో స్టార్ హీరోలు సైతం వడివేలు డేట్స్ చూసుకొనే షూటింగ్ పెట్టుకునే వాళ్లంటే అతడు ఏ స్థాయికి చేరుకున్నాడో యిట్టె అర్ధం చేసుకోవచ్చు.

కానీ అవన్నీ పూర్వ వైభవం. తమిళనాట హాస్యం లో రారాజులా వెలుగొందుతున్న సమయాన ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు సినీ రంగ పునః ప్రవేశం చేసి ఆయన పాత రోజుల మాదిరి కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు.కాగా ఆయన ప్రవర్తన శైలి లో ఇప్పుడు చాలా మార్పులు సంభవించాయి.  సకాలంలో షూటింగ్ కి రాకుండా, ఒకవేళ షూటింగ్ కి వస్తే ఫుల్లుగా మద్యం తాగేసి వస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడట దర్శక నిర్మాతలను .

తాజాగా హింసే సరసన్ 23వ పులకేశి అనే చిత్రం చేస్తున్నాడు వడివేలు. భారీ బడ్జెట్ కావడంతో నిర్మాతలు కంగారుపడి ఫిలింఛాంబర్ కి ఫిర్యాదు చేశారు. ఈయన వ్యవహారం పరిశీలించిన ఫిలిం ఛాంబర్ పెద్దలు ఆయన చేసిన పనికిగాను 9 కోట్ల నష్టపరిహారం విధించారు. అప్పటికి ఖాతరు చేయకపోవడంతో ఆయన్ని సినిమాల నుండి బ్యాన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.