జనసేనాని పై భారీ కుట్ర

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-26 02:58:21

జనసేనాని పై భారీ కుట్ర

ఐదు ఏళ్ల క్రితం జనసేన అనే పార్టీ స్థాపించి, ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలలో చురుగ్గా ఉంటూ,వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఉద్దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ పై రాజకీయం గా భారీ ఎత్తున కుట్ర జరగబోతుంది అంట. ఇంతకీ పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసా..ఓ స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.

ఓ వర్గం వారు ఒక స్టార్ హీరోయిన్ ని కలిసి పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి ఆరోపణలు చేయాలనీ కోరగానే మొదట భయపడిందట అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని నచ్చజేప్పడమే కాకుండా , ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఆరోపణలు చేస్తే అవలీలగా నమ్మేస్తారని అతడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పడంతో సరే అని ఒప్పుకుందట. ఇది వరకు శ్రీ రెడ్డి, పూనమ్ కౌర్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదిక గా కామెంట్స్ చేశారు.

అయితే మీడియాలో వచ్చి లైవ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయాలనీ కోరడంతో వెంటనే భయపడిపోయిందట. పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం లేదు, అలాగని కోపం లేదు కాబట్టి నాకు అనవసర విషయాలు వద్దు నన్ను వదిలేయండి ఇలా ఉండనివ్వండి అని ఆ డీల్ ని తిరస్కరించిందట. లేదంటే ఇప్పుడు మీడియాలో రచ్చ రచ్చ అయ్యుండేది. రాజకీయాల్లో దూసుకుపోతున్న పవన్ పై ఇలాంటి ఆరోపణలు వస్తే , ఇమేజ్ డమేజ్ అవుద్దీ అని సదరు వర్గాల అభిప్రాయం.ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది కాబట్టి సరిపోయింది. ఎంతైనా రాజకీయాలు ఎంత నీచంగా తయారయ్యాయని   ఈ సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.

షేర్ :

Comments

0 Comment