1 నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ బంద్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-05 06:41:38

1 నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ బంద్

ఈ ఆధునిక యుగంలో  రోజుకొక టెక్నాల‌జీ  ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌ల్ల... చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అనేక మంది న‌ష్టపోతున్న‌ సంగ‌తి తెలిసిందే...  తాజాగా డిజిట‌ల్ విధానాన్ని సినిమా ప‌రిశ్ర‌మ‌లో  ప్ర‌వేశ పెట్టడంతో  తాము పూర్తి స్థాయిలో న‌ష్ట‌పోతామ‌ని నిర్మాత‌ల మండ‌లి చెప్పుకొచ్చినా ఎవరూ ప‌ట్టించుకోకపోవడంతో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ మార్చి ఒక‌టిన త‌మిళ నిర్మాత‌ల మండ‌లి బంద్ కు పిలుపునిచ్చింది.. ఆ రోజు  షూటింగ్ ల‌ను, సినిమాల  విడుద‌ల‌ను నిలిపివేసి ప్ర‌తీ ఒక్క‌రూ  బంద్ కు స‌హ‌కరించాల‌ని సినీ నిర్మాతల‌ మండ‌లి తెలిపింది.
 
డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు...అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని,  లేని ప‌క్షంలో దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ త‌రుపున నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.