అక్కినేని కుటుంబాన్నిచూసి వెనక్కి తగ్గినా సుధీర్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero sudheer babu
Updated:  2018-08-30 12:33:17

అక్కినేని కుటుంబాన్నిచూసి వెనక్కి తగ్గినా సుధీర్ బాబు

“సమ్మోహనం” తో అటు కుటుంబ ప్రేక్షకులకు ఇటు యువతకు బాగా దగ్గరయ్యాడు సుధీర్ బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వ ప్రతిభ, అతిధి రావ్ హైదరి అందం అభినయం తోడవడంతో సుధీర్ కి హిట్టు కొట్టే పని ఇంకాస్త సులభం అయ్యింది. ప్రేక్షకులు ఆ మ్యాజిక్ మర్చిపోక ముందే ఇంకో సినిమాతో సిద్ధం అయ్యాడు.
 
“నన్నుదోచుకుందువటె” అంటూ వచ్చే నెల 13వ తరీఖున ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడని ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు కూడా.అసలు చిక్కు ఏంటంటే నాగ చైతన్య నటించిన “శైలజారెడ్డి అల్లుడు” సమంత నటించిన “U టర్న్” చిత్రాలు కూడా అదే రోజు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. చై-సామ్ లతో పోల్చి చూస్తే మనోడి మార్కెట్ అంతంత మాత్రమే. కాబట్టి వాళ్ళతో పోటీపడితే కావాలనే బొక్కబోర్లా పడ్డట్టు అవుతుంది.
 
మొదట్లో వారం రోజులు లేట్ గా వస్తాం అనుకున్న చిత్రబృదం సుధీర్ మొండిపట్టుదల కారణంగా అదేరోజు వస్తుందని తెలిపారు. అయితే సుధీర్ బాబు మాత్రం పైకి 13న వస్తున్నాం అని చెప్పినా ఒక వారం లేటుగానే రావాలని అనుకుంటున్నాడంటా. ఈలోపు చిత్రం తాలూకు ప్రమోషన్ కార్యక్రమాలు ముగిద్దాం అనుకుంటున్నడని టాక్. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని తన టీం మెంబెర్స్ కి చెప్పడంటా.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.