Updated: 2018-03-19 03:28:21
సుధీర్ లవ్ స్టోరీ
సుడిగాలి సుధీర్... జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు...ఎప్పుడు చలాకీగా, అమ్మాయిలను ఆటపట్టిస్తూ ఉండే సుధీర్ తన కామెడీ టైమింగ్ తో ప్రపంచాన్ని నవ్వించడమే కాకుండా...మ్యాజిక్ తో మాయ చేయగలడు, పాటతో మైమరిపించగలడు, డాన్స్ చేయగలడు...ఇంకా ఆయనలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు కానీ, ఆయనకు హృదయాన్ని హత్తుకునే ఒక లవ్ స్టోరీ మాత్రం ఉంది...
23 మే 2013 తేదీన నేను, వేణు అన్న అన్నపూర్ణలో స్కిట్ ప్రాక్టీస్ చేస్తుండగా కార్ లో నుంచి ఒక అమ్మాయి దిగింది...ఆ అమ్మాయిని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్...ఎవరు ఈ అమ్మాయి ఎంత బాగుంది అని మనసులో అనుకున్న... అంతలోనే రష్మి సీటు లో కూర్చుంది...మా డైరెక్టర్ తీసుకెళ్లి సుధీర్ అని పరిచయం చేశాడు. అప్పుడే ఫస్ట్ టైం రష్మీ చేతిని నేను తాకింది...అప్పుడు ఎక్కడ లేని ఆనందం వేసిన...అప్పుడు నాకు ఏదో ఫీలింగ్ కలిగింది కానీ ఆ ఫీలింగ్ ఏంటో అప్పుడు నాకు అర్థం కాలేదు...
బ్లూ కలర్ డ్రెస్, గోల్డెన్ కలర్ హీల్స్..మెటాలిక్ వాచ్ విత్ బ్లాక్ బెల్ట్... purple కలర్ ఐ షేడ్, డైమండ్ కలర్ ఇయర్ రింగ్స్ వేసుకున్న అందమైన రష్మీ రూపం నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది...ఆరోజును ఎప్పటికి మర్చిపోలేను...
ఆ తర్వాత 16 జనవరి 2015 రోజున జడ్జెస్ ఫటాఫట్ లో రష్మీకి ప్రపోజ్ చేయమని ఒక టాస్క్ ఇచ్చారు..." ఇంద్ర ధనసులో లేని ఎనిమిదో రంగే రష్మీ...రష్మీని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానో లేదో తెలియదు కానీ నీ బాధకు మాత్రం నేను కారణం అవ్వను అని రింగ్ ఇచ్చి will You Marry Me అని ప్రపోజ్ చేశాను "...ఆ ప్రపోజ్ టాస్క్ లో భాగంగా చేసిన, ఆ మాటలన్నీ నా మనసులో నుంచే వచ్చాయి...ఫస్ట్ టైం రష్మీకి ప్రపోజ్ చేయడంతో ఆరోజు నా ఆనందానికి హద్దులు లేవు
తర్వాత ఒక రోజు నేను లొకేషన్ లో ఉన్నపుడు రష్మీ ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పింది...ఆరోజు నేనే స్కిట్ కొట్టాను... "ఈ అమ్మాయి ఒక్కసారి నాకు ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తేనే స్కిట్ కొట్టానంటే, ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉండి, నాకు రోజు ఎదురొస్తే నాకు జీవితాంతం ఓటమనేదే ఉండదు అని అనిపించింది"... ఆరోజే నాకు అనిపించింది నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని...
"నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తేనే నేను చచ్చిపోతా"
అంటూ ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, తన మనసులో మాటలను బయటపెట్టాడు...
Comments