సునీల్ కామెడీ అరవింద లో పండేనా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sunil comedian
Updated:  2018-09-07 05:26:36

సునీల్ కామెడీ అరవింద లో పండేనా?

‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మానందం గారిని జూనియర్ ఎన్టీఆర్ గురువు గారు గురువు గారు అంటూ చేసే కామెడీ ఇప్పటికి మనం మర్చిపోలేము. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు అంతలా నవ్వియించాయి మరి. మళ్ళీ ఇదే తరహా హాస్యాన్ని పండించడానికి ఎన్టీఆర్ మరోసారి రెడి అయినట్టు కనబడుతున్నాడు.
 
ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి గురువు ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు త్రివిక్రమ్ కి స్నేహితుడు సునీల్. నిన్న మొన్నటివరకు హీరో వేషాలు వేసిన సునీల్ మళ్ళీ పూర్వ వైభవం పొందడానికి కృషి చేస్తున్నారు.
 
ఈ సినిమాలో దాదాపు 90శాతం సీన్స్ లో సునీల్ ఉంటాడన్నది చిత యూనిట్ సమాచారం. ప్రతీ సన్నివేశం లోను సునీల్ ని గురువు గారు అంటూ ఎన్టీఆర్ మంచి కామెడీని పండిస్తారని వినికిడి. అయితే ఇవ్వాళ రిలీజ్ ఐన ‘సిల్లీ ఫెల్లోస్’ లో మాత్రం సునీల్ నటన మరియు కామెడీ టైమింగ్ గతి తప్పిందేమో అనిపించక మానదు. మరి త్రివిక్రమ్ మాత్రం సునీల్ కోసం స్ట్రాంగ్ కామెడీ ట్రాక్ ని రాసుకున్న తరుణంలో అది ఏవిధంగా స్క్రీన్ మీద చూపిస్తారో వేచి చూడక తప్పదు. 
 
ఏదీ ఏమైనప్పటికీ సునీల్ ని  హీరో నుండి సడన్ గా కమెడియన్ గా చూసినప్పుడు టైమింగ్ లో మియా మాచ్ ఉండటం సహజమే. కానీ అదే మిస్ టైమింగ్స్ ని చర్ర్య్ చేస్తాడా లేదా అనేదే సందేహం.