అల్లు వారి ఫ్యామిలీ ని సునీల్ ఎందుకు ఆకాశానికి ఎత్తేశాడు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

comedian sunil
Updated:  2018-08-23 01:50:55

అల్లు వారి ఫ్యామిలీ ని సునీల్ ఎందుకు ఆకాశానికి ఎత్తేశాడు ?

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం హీరోగా అంత గొప్ప సినిమాలు ఏవి చెయ్యట్లేదు. ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్ళి కమెడియన్ గా ట్రయిల్స్ చేస్తున్నాడు సునీల్. సునీల్ బెస్ట్ ఫ్రెండ్ అయియన్ త్రివిక్రమ్ ఇప్పటికే తను నెక్స్ట్ డైరెక్ట్ చేస్తున్న "అరవింద సమేత" లో ఒక మంచి క్యారెక్టర్ ని ఇచ్చాడు.

ఇటివలే రిలీజ్ అయిన ఈ టిజర్ లో ఎన్టీఆర్ తో పాటు సునీల్ కూడా కనిపిస్తాడు. అయితే ఇప్పుడు మెగా హీరోల సినిమాల్లో కూడా నటించేందుకు మెగా ఫ్యామిలీని అలాగే అల్లు వారి ఫ్యామిలీ ని కాక పట్టే పనిలో ఉన్నాడు సునీల్. ఇటివలే జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకి హాజరయిన సునీల్ అక్కడ అల్లు వారి ఫ్యామిలీని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక అల్లు అర్జున్‌తో తన అనుబంధం గురించి చెబుతూ తనను అతనెప్పుడూ ఒక ఆర్టిస్టులా చూడలేదని ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడని అన్నాడు.

తన కారవాన్లోనే కూర్చోబెట్టుకుని తనకోసం తెప్పించిన భోజనం పెట్టి ప్రేమను పంచేవాడని సునీల్ చెప్పాడు. అల్లు వారి కుటుంబంలో అందరూ మంచి వాళ్లే అని, అలాగే మెగా ఫ్యామిలీ కూడా చాలా గొప్పది అంటూ వారిని పోగిడేసాడు. అయితే కేవలం అవకాశాల కోసమే సునీల్ ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారు కొంత మంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.