వెన్నెల కిషోర్ కి వార్నింగ్ ఇచ్చిన సునీల్..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-28 17:02:46

వెన్నెల కిషోర్ కి వార్నింగ్ ఇచ్చిన సునీల్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ ఎప్పటికప్పుడు తెలుగులోకి కొత్త రక్తం వస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు వెన్నెల కిషోర్. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో వెన్నెల కిషోర్ ఉన్నాడు.

ఈ మధ్య రిలీజ్ అయిన "గూఢచారి" "గీత గోవిందం" లో సినిమాలో కూడా మంచి పాత్రలు చేసి ప్రేక్షకులని నవ్వించాడు వెన్నెల కిషోర్. ఇదిలా ఉంటే స్టార్ హీరో అయిన ప్రభాస్ "సాహో" సినిమాలో కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్న వెన్నెల కిషోర్. ఇదిలా ఉంటే హీరో గా అవకాశాలు లేక మళ్ళి కమెడియన్ వేషాలు వేసుకుంటున్న సునీల్ వెన్నెల కిషోర్ కి వార్నింగ్ ఇచ్చాడు అని తెలిసింది.

ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక నిర్మాత ఇంకా దర్శకుడుకి కమెడియన్ అనగానే వెన్నెల కిషోర్ ఏ గుర్తొస్తున్నాడు. తనకి వచ్చే అవకాశాలని కూడా వెన్నెల కిషోర్ లాగేసుకుంటున్నాడు అనే ఉద్దేశం లో సునీల్ ఉన్నాడు అంట, అందుకే సునీల్ వెన్నెల కిషోర్ కి ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చాడు అని తెలిసింది. మరి ఈ విషయం పై సునీల్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.