స‌న్నీ అర్థ‌న‌గ్నంతో పంట‌ల‌కు విముక్తి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-12 12:35:43

స‌న్నీ అర్థ‌న‌గ్నంతో పంట‌ల‌కు విముక్తి

ప్ర‌తీ ఏట రైతు పండించిన పంట‌కు దిష్టి త‌గల‌కుండా, ఆ పంట‌కు మ‌నిషి ఆకారంలో ఉన్న బొమ్మ‌ను త‌యారు చేసి, ఆ బొమ్మ‌కు తెల్ల‌ని దుస్తులు ధ‌రించి, దానిని పంట పొలాల్లో పెడుతుంటారు రైతులు...అలా పెడితే పంట‌కు దిష్టి త‌గ‌ల‌ద‌ని రైతులు భావిస్తారు, పంట‌కూడా అధిక దిగుబ‌డి ఇస్తుంద‌ని రైతుల న‌మ్మ‌కం... ఈ ఆచారం త‌ర‌త‌రాల నుంచి వ‌స్తోంది. 
 
అయితే ఇటీవ‌లే ఈ ఆచారానికి భిన్నంగా, కొంత‌మంది రైతులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు... సంప్ర‌దాయ దిష్టి బొమ్మ‌ను పంట పొలాల్లొ పెడితే,  పండించిన పంట‌కు దిష్టి పోవ‌డం లేద‌ని భావించిన రైతులు, ర‌క‌ర‌కాలుగా ఆలోచించారు.. అలా ఆలోచించిన త‌ర్వాత, చివ‌ర‌కు శృంగార తార బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ ఫోటోను త‌మ పంట పొలాల్లో పెడితే పంట‌కు దిష్టి త‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు...   అలా చేస్తే దారిన పోయే వారి దృష్టి త‌మ పంట‌పై కాకుండా స‌న్నీ లియోన్ ఫోటో పై మ‌ల్చుతున్నారు.
 
ఈ సంఘ‌ట‌న శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దుత్త‌లూరు మండ‌లం బ్ర‌హ్మేశ్వ‌ర గ్రామంలో జ‌రిగింది.. ఈ గ్రామానికి చెందిన రైతులు, బెండ, క్యాబేజీ, కాలీఫ్ల‌వ‌ర్ వంటి వివిధ ర‌కాల పంట‌ల‌ను సాగు చేస్తున్నారు... వారు పండించిన పంటలు మొద‌ట్లో చూడ‌డానికి చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నా, పంట దిగుబ‌డి మాత్రం త‌గ్గుతోందని భావించారు.. పండించిన పంట‌కు దారిన పోయేవారి దిష్టి త‌గులుతోంద‌ని ఆలోచించి,  రైతులు వారి దృష్టిని పంటల మీద నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేసి !! ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా!!  అనే స్లోగన్ రాయించారు.. వాట్ ఏ ఐడియా అంటున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.