స‌న్నీలియోన్ వీర‌లెవెల్లో చూపిస్తోంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-07 05:56:03

స‌న్నీలియోన్ వీర‌లెవెల్లో చూపిస్తోంది

పోర్న్ స్టార్ గా జీవితాన్ని మొద‌లు పెట్టి, ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది స‌న్నీలియోన్... ప్ర‌స్తుతం ఆమెకున్నంత ఫాలోయింగ్ మ‌రే హీరోయిన్ కు కానీ, హీరోకు కాని లేద‌ని  చెప్ప‌డంలో ఏమాత్రం సందేహం లేదు. బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి జిస్మ్2 సినిమా ద్వారా అడుగు పెట్టింది స‌న్నీలియోన్... ప్ర‌స్తుతం ఈమెకు వ‌రుస సినిమా ఆఫ‌ర్స్  వ‌స్తున్నాయి... స‌న్నీ త‌న న‌ట‌న‌తో ఏమాత్రం అందాల‌ను దాచుకోకుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది ఈ సెక్సీ బ్యూటీ.
 
ప్ర‌స్తుతం బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా టాలీవుడ్, మల్లువుడ్ , కోలీవుడ్ రంగాల‌లో అడుగు పెట్టి ఐట‌మ్ సాంగ్ ల‌తో కుర్ర‌కారును మ‌త్తెక్కిస్తోంది స‌న్నీలియోన్... కాగా ఇటీవ‌లే టాలీవుడ్ లో రాజ‌శేఖ‌ర్ హీరోగా  ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన చిత్రం పీఎస్. వీ గ‌రుడ‌వేగ  సినిమాలో ఒక ఐట‌మ్ సాంగ్ కు డాన్స్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను  ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే తాజాగా స‌న్నీలియోన్ న‌టిస్తోన్న చిత్రం వీర మ‌హాదేవి... ఈ సినిమాకు త‌మిళ ద‌ర్శ‌కుడు వడివుడైయన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు... ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడ‌క్ష‌న్స్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది చిత్ర‌యూనిట్...ఇక‌ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టేందుకు మంగ‌ళ‌వారం నాడు స‌న్నీలియోన్ కొబ్బరికాయ కొట్టారు... చారిత్ర‌క నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు నిర్మించనున్న ఈ చిత్రం.. తెలుగు, త‌మిళం, హిందీ,  బాష‌ల్లో తెర‌కెక్కించనున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.