సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నారో తెలుసా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajinikanth image
Updated:  2018-03-10 03:35:01

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నారో తెలుసా?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ న‌టిస్తున్న చిత్రం కాలా, 2.0... ఈ చిత్రం గురించి ప్ర‌తీ రోజు ఆసక్తికర వార్తలు వ‌స్తుండ‌గా అభిమానుల్లో రోజు రోజుకు ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది...అయితే ర‌జనీ ఈ రెండు చిత్రాలు షూటింగ్ త‌ర్వాత, తాను పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లో ఉంటాన‌ని  చెప్పిన సంగ‌తి తెలిసిందే..కాగా తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఆధ్యాత్మిక మార్పు తెస్తాన‌ని వ్యాఖ్యానించారు త‌లైవా.
 
ఇటీవ‌లే కాలా, 2.0 షూటింగ్ పూర్తి చేసుకున్న ర‌జ‌నీ, చెప్పా పెట్ట‌కుండా హిమాల‌యాల‌కు వెళ్లిపోయారు... ర‌జ‌నీ హిమాల‌యాల‌కు వెళ్లిన  విష‌యాన్నిఆయ‌న‌ ప్ర‌తినిధి రియాజ్ మీడియాకు వెల్ల‌డించారు... ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత త‌న‌కు ఇష్ట‌మైన ప్రాంతాన్ని వెతుక్కుంటూ హిమాల‌యాల‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది ర‌జ‌నీకాంత్.
 
ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న త‌లైవా... ఒక సాదా సీదా, సాధార‌ణ మ‌నిషిలా హిమాలయాల‌కు వెళ్ల‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది...అక్క‌డే ఒక వారం పాటు సాధార‌ణ వ్య‌క్తిలా ఏకాంతంగా ధ్యానించి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి  వ‌స్తార‌ని త‌లైవా స‌న్నిహిత వ‌ర్గాలు తెలుపుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.