ర‌జనీ భార్యకు షాక్ఇచ్చిన సుప్రీం కోర్టు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-20 05:09:04

ర‌జనీ భార్యకు షాక్ఇచ్చిన సుప్రీం కోర్టు

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు  దేశ వ్యాప్తంగా పాపూలారిటి ఉంది. ఆయ‌న సినిమాలు కాసుల వ‌ర్షం  కురిపిస్తాయ‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ర‌జ‌నీకాంత్ హీరోగా, దీపిక పదుకొనె హీరోయిన్‌గా తెర‌కెక్కించిన కొచ్చాడియ‌న్ - తెలుగులో విక్ర‌మ్‌సింహపురి సినిమా  అనుకున్నంత స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.  దీంతో భారీ స్థాయిలో న‌ష్టం వ‌చ్చింది సినీ నిర్మాత‌కు.
 
కొచ్చాడియ‌న్ సినిమాను నిర్మిస్తున్న‌ మీడియావన్ సంస్థకు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. దీనికి పూచిక‌త్తుగా రజనీ భార్య లతా రజనీకాంత్ అప్ప‌ట్లో సంత‌కం చేశారు. రుణం తీసుకున్న మొత్తంలో కొంత మేర‌కు వెంట‌నే చెల్లించింది నిర్మాణ సంస్థ. మిగిలిన రుణాన్ని ఇంత వ‌ర‌కు చెల్లించ‌లేదు స‌దురు సంస్థ. 
 
ఈ ఆర్థిక లావాదేవీలపై కొచ్చాడియాన్‌ టీం నుంచి ఎలాంటి స్పందన రాక‌పోవ‌డంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది యాడ్ బ్యూరో కంపెనీ. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. కొచ్చాడియ‌న్ సినిమాకు ర‌జ‌నీ గారాల ప‌ట్టి సౌంద‌ర్య ద‌ర్శకత్వం వ‌హించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.