సూర్య కుటుంబం ఎంత ప‌నిచేసిందంటే ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-24 07:43:35

సూర్య కుటుంబం ఎంత ప‌నిచేసిందంటే ?

త‌మిళ హీరో సూర్య కుటుంబాన్ని అభిమానులు ఎంత అద‌రిస్తారో అదే విధమైన అభిమానాన్నిసూర్య కుటుంబం కూడా చూపిస్తుంది... సాధార‌ణంగా త‌మిళ హీరోలు ప్ర‌జ‌ల‌కున్న స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డంలో ముందుంటారు. అది ప్ర‌త్య‌క్షంగానైనా లేక , ప‌రోక్షంగానైనా త‌మ వంతు స‌హ‌యం చేస్తుంటారు... గ‌తంలో రైతుకు గిట్టుబాటు ధ‌ర‌, జ‌ల్లిక‌ట్టు లాంటి ఉద్య‌మాల‌కు సైతం ప్ర‌త్య‌క్షంగా పోరాడారు త‌మిళ హీరోలు.

అయితే సూర్య ఫ్యామిలీ మాత్రం రాజ‌కీయాల‌కు పూర్తి దూరం.... కాని స్వ‌చ్చంద సంస్థ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు... అగ‌రం ఫౌండేష‌న్‌ను సూర్య న‌డిపిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.... త‌న అభిమానులకు ఏ క‌ష్టం వ‌చ్చినా నిరంత‌రం అందుబాటులో ఉంటారు హీరో సూర్య‌.... ఆయ‌న సోద‌రుడు కార్తి కూడా అభిమానుల‌పై ఇదే ప్రేమ‌ను చూపిస్తారు....ఇటీవ‌ల కార్తి అభిమాని చ‌నిపోతే అంత్య‌క్రియ‌ల‌కు సైతం హ‌జ‌ర‌య్యారు కార్తి.

తాజాగా సూర్య ఇంట్లో ప‌నిచేసే వ్య‌క్తి వివాహానికి సూర్య కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యారు... ఆ పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించారు సూర్య దంప‌తులు... కుటుంబ పెద్ద‌గా హీరో సూర్య తాళిని స్వ‌యంగా అందించారు... అలాగే ఆ పెళ్లికి సంబంధించిన మొత్తం ఖ‌ర్చుని సూర్య‌ భ‌రించిన‌ట్లు తెలుస్తోంది....ఈ పెళ్లికి సూర్య కుటుంబం మొత్తం హ‌జ‌రైంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.