ప్రెస్ ముందు కనీళ్ళు పెట్టుకున్న అక్కినేని హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sushanth
Updated:  2018-07-31 12:25:21

ప్రెస్ ముందు కనీళ్ళు పెట్టుకున్న అక్కినేని హీరో

అక్కినేని ఫ్యామిలీ నుంచి "కాళిదాసు" చిత్రంతో హీరోగా పరిచయమైన సుశాంత్ కు ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. "కాళిదాసు" "కరెంట్" "అడ్డా" "ఆటాడుకుందాం రా" ఇన్ని సినిమాలు చేసిన గాని అన్ని ఫ్లాప్స్ గానే నిలిచాయి. అందులో "కరెంట్" అనే ఒక్క సినిమా మాత్రం బీలో ఆవరేజ్ గా నిలిచింది.

ఇక సుశాంత్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా "చి ల సౌ”. అయితే సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ్ రావు కి అప్పుడెప్పుడో మాట ఇచ్చాడట తప్పకుండా హిట్ కొడతా నాన్న అని, కానీ సుశాంత్ హిట్ చూడకుండానే చనిపోయాడు వాళ్ళ నాన్న. దాంతో ఈ "చి ల సౌ" కథ నాన్నకు చెప్పానని తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడని తండ్రి ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సుశాంత్.

మరి ఈ సినిమా యిన సుశాంత్ ఎదురుచూస్తున్న హిట్ ని తెచ్చిపెడుతుందో లేదో చూద్దాం. హీరో రాహుల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ఆగష్టు 3 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.