సైరా సెట్ ని కూల్చేసిన అధికారులు ఎందుకో తెలుసా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-02 03:45:40

సైరా సెట్ ని కూల్చేసిన అధికారులు ఎందుకో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
 
ఇక నయనతార హీరోయిన్ గా  నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఈ చిత్రం కోసం జూబ్లీ హిల్స్ లోని ప్రత్యేక స్థలంలో సెట్ వేశారు అయితే తాజా సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా "సైరా" సినిమా కోసం సెట్‌ వేశారని పేర్కొంటూ ఆ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. 
 
దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోని మరల సెట్ నిర్మించి ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసే దిశగా  చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీతం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడుగా అమిత్ త్రివేదిని తీసుకున్నట్లు సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.