తెలివైన తమన్నా, నగల వ్యాపారం లో మిల్కీ బ్యూటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tamanna
Updated:  2018-09-12 05:47:56

తెలివైన తమన్నా, నగల వ్యాపారం లో మిల్కీ బ్యూటీ

‘ఆగడు’ సినిమా లో తమన్నా కరుడుగట్టిన వ్యాపారి. తన వ్యాపారాభివృద్ది కోసం ఎంతటి సాహసానికైనా రెడీ అనే భామ పాత్ర.ఇప్పుడు నిజ జీవితం లో కూడా అలానే చెయ్యాలని నిశ్చయించుకుంది. కాకపోతే అక్కడ స్వీట్లు ఇక్కడ నగలు. అవును ఇపుడు తమన్నా తన సొంత నగల బ్రాండ్ ని ఓపెన్ చేయనుంది.
హీరోలు వ్యాపారాల్లో అడుగు పెట్టడం కొత్తేం కాదు. హీరోయిన్స్ వ్యాపారాల్లో ఆసక్తి చూపడం చాలా అరుదు. తాజాగా తమన్నా కూడా వ్యాపార రంగంలో అడుగు పెట్టేందుకు రెడి అయ్యింది. ఖరీదైన వజ్రాల వ్యాపారంను తమన్నా ఎంచుకుంది.
 
రిసెంట్ గా తమన్నా తన వ్యాపార విషయాన్ని ఆఫీసియల్ ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరుమీద కొత్త డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ను ప్రారంభించబోతున్నట్లుగా ఆమె తెలిపింది. మొదటి సారి తమన్నా తన పేరుపై బ్రాండ్ ను విడుదల చేస్తున్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాల్లో ఇక తన పని చివరికి దశకు చేరుకుంది అనుకుందేమో ఇప్పుడు కొత్త సంపాదన మార్గాలను వెతుకుతూ వెళ్తుంది.
 
ఈ మధ్య తెలుగులో ‘ఎఫ్ 2’ చిత్రంతో పాటు క్వీన్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న తమన్నా మెల్ల మెల్లగా సినిమాల నుండి తప్పుకున్న తర్వాత ఆమె పూర్తిగా జ్యూవెలరీ వ్యాపారంలో స్థిరపడి పోయే అవకాశం ఉందని ఆమెకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్న తమన్నా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. వ్యాపారం అంటే అం