తమన్నాని వదిలిపెట్టేది లేదు అంటున్న ప్రభుదేవా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhu deva and tamanna
Updated:  2018-08-22 12:53:00

తమన్నాని వదిలిపెట్టేది లేదు అంటున్న ప్రభుదేవా

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, మిల్కి బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం "అభినేత్రి", 2017లో విడుదల ఈ చిత్రం తమిళ- హిందీ- తెలుగు భాషల్లో తెరకెక్కింది. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, తెలుగులో ఒక మోస్తరుగా ఆడింది, ఇక హిందీలో డిజాస్టర్ అయ్యింది ఈ చిత్రం.

అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ప్రభుదేవా, ఈ మేరకు దర్శకుడు విజయ్ తో కథ చర్చల్లోనూ పాల్గొంటున్నట్లు ప్రభుదేవా ప్రకటించాడు, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ చిత్రంలో గత భాగంలో నటించిన తమన్నానే ముఖ్య పాత్రలో నటిస్తుంది అంట.

అసలు తమన్నాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ప్రభు దేవా గట్టిగా అనుకోని కూర్చొని ఉన్నట్టు ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రభుదేవా నటించిన తాజా చిత్రం "లక్ష్మి" ఈ నెల 24న విడుదల కాబోతోంది, పూర్తిస్థాయి డాన్స్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా డాన్స్ కోచ్ గా నటిస్తున్నాడు. అయితే గత కొద్దికాలంగా ప్లాప్స్ లో ఉన్న ప్రభుదేవాకి ఈ చిత్రం విజయం అందిస్తుందో లేదో చూడాలి.

షేర్ :