ఆ ఐటెం సాంగ్ నుంచి తమన్నా ని అందుకే తీసేశారా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tamanna
Updated:  2018-09-11 04:23:52

ఆ ఐటెం సాంగ్ నుంచి తమన్నా ని అందుకే తీసేశారా..?

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సినిమా "సవ్యసాచి". ఎప్పుడో అనగా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే "నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు" అనే నాగార్జున సాంగ్ ని నాగ చైతన్య తో ఈ సినిమాలో రీ మిక్స్ చేద్దాం అని మూవీ యూనిట్ అనుకున్నారు.

మొదట్లో ఈ పాటలో చై పక్కన డాన్స్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాను అడిగారు. ఆమె కూడా ఒప్పుకుంది. కానీ డేట్స్ కుదరకపోవడంతో పాట షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక చైతు పక్కన ఐటెం సాంగ్ చెయ్యలేను అని చెప్పి తమన్నా కూడా ఈ ఐటెం సాంగ్ ని లైట్ తీసుకుంది అని తెలుస్తుంది.

అయితే దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్ నిధి అగర్వాల్ తోనే పాట లో డాన్స్ చేయిద్దాం అని నిర్ణయించుకున్నారట. ఐటమ్ సాంగ్ లో వేరే హీరోయిన్ ను పెడితే కథ ఫ్లో డిస్టర్బ్ అవుతుందేమో అనే ఆలోచనలో ఇలా చేశారని చెప్తున్నారు కానీ కొందరు మాత్రం తమన్నా డేట్స్ ఇవ్వడంలో బాగా లేట్ చేస్తుండడంతో అలాగే నిరాతలకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల విసిగిపోయి ఈ సినిమా హీరోయిన్ తోనే పాట షూటింగ్ కానిచ్చేద్దామని ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. ఇందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.