తమన్నా, సందీప్ కిషన్ సినిమా ఇక రిలీజ్ కాదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tamanna and sandeep kishan
Updated:  2018-08-17 12:27:53

తమన్నా, సందీప్ కిషన్ సినిమా ఇక రిలీజ్ కాదు

స్టార్ హీరోయిన్ అయిన తమన్నాకి తెలుగులో ఇప్పుడసలు మార్కెట్ ఏ లేదు. అయితే ఇలాంటి టైం లో తమన్నా ఆశలన్నీ "క్వీన్" సినిమా రీమేక్ అయిన "దటీజ్ మహాలక్ష్మి" మీదే ఉన్నాయి. కానీ ఆ సినిమాకి కూడా తెలుగులో పెద్దగ బజ్ లేదు. మరోవైపు తమన్నా నటించిన ఇంకో అసలు రిలీజ్ కూడా అవ్వడం లేదు.

అమీర్ ఖాన్ తో "ఫనా" లాంటి సినిమా తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో తమన్నాఇంకా సందీప్ కిషన్‌లను పెట్టి ఒక సినిమా చేశాడు. ఈ సినిమా చాలా వరకు లండన్లోనే షూటింగ్ చేసుకుంది. గత ఏడాదే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది.

కానీ ఆ తర్వాత అసలు ఈ సినిమా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. అయితే సినిమా అస్సలు బాలేదు అని పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమన్నా కి ఇంకా సందీప్ కిషన్ కి అసలు మార్కెట్ ఏ లేదు అని అందుకే ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయకుండా మధ్యలో వదిలేసినట్లు సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.